Ad Code

టీసీఎస్ లో 16 మంది ఎగ్జిక్యూటివ్‌లకు ఉద్వాసన !

ముడుపులకు కొలువులు' కేసులో 16 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తెలిపింది. 'ఉద్యోగాలకు ముడుపులు' కుంభకోణంపై కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న 16 మంది ఉద్యోగులను తొలగించింది. మరో ముగ్గురు ఉద్యోగులను హెచ్ఆర్ విభాగం నుంచి బదిలీ చేసినట్లు స్టాక్ ఎక్స్చేంజ్‌లకు ఇచ్చిన ఫైలింగ్‌లో తెలిపింది. గత జూన్‌లో ప్రజా వేగు ఫిర్యాదుతో కదిలిన టీసీఎస్.. ప్రాథమిక దర్యాప్తులో అవకతవకలు జరిగినట్లు గుర్తించింది. దీంతో లోతైన విచారణ కోసం కమిటీని నియమించింది. నాలుగు నెలల దర్యాప్తు తర్వాత సదరు కమిటీ ఇచ్చిన నివేదికపై టీసీఎస్ చర్యలు తీసుకున్నది. తమతో వ్యాపార లావాదేవీలు నిర్వహించే ఆరుగురు విక్రేతలు, వాటి అనుబంధ యాజమాన్యాలపై టీసీఎస్ నిషేధం విధించింది. అయితే ఈ కుంభకోణంలో మేనేజర్ స్థాయి ఉద్యోగుల పాత్ర లేదని గుర్తించామని టీసీఎస్ తెలిపింది. కంపెనీకి ఈ స్కాంతో ఎటువంటి సంబంధం లేదని, ఆర్థికంగా ఎటువంటి నష్టం వాటిల్లలేదని పేర్కొంది. భవిష్యత్‌లో ఇటువంటి పరిణామాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని వివరించింది. అందుకనుగుణంగా కంపెనీ పాలనా విధానాల్లో మార్పులు తెస్తామని వెల్లడించింది.

Post a Comment

0 Comments

Close Menu