Ad Code

అట్టహాసంగా ప్రారంభమైన ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2023


ఢిల్లీ లోని ప్రగతీ మైదాన్ లో ప్రధాని నరేంద్ర మోడీ ఆసియా అతిపెద్ద ప్రీమియర్ టెక్నాలజీ ఎగ్జిబిషన్ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2023 ను ఈరోజు లాంఛన ప్రాయంగా ప్రారంభించారు. ఇది  అక్టోబర్ 27, 28,29 తేదీలలో నిర్వహించ బడుతుంది. ఈ అతిపెద్ద టెక్నాలజీ ఎగ్జిబిషన్ నుండి టెక్ దిగ్గజాలైన Reliance, Nokia, Airtel, AMD లాంటి  కంపెనీలు త్వరలో తీసుకు రాబోతున్న కొత్త టెక్ లను ఈ టెక్నాలజీ ఎగ్జిబిషన్ లో ప్రదర్శిస్తాయి. ఇండియా మొబైల్ కాంగ్రెస్ అనేది ప్రతి సంవత్సరం కొత్త టెక్నాలజీ ఇన్వెన్స్ లను ప్రదర్శించాడనికి భారత ప్రభుత్వం చేపట్టే ఎగ్జిబిషన్. ఈ టెక్ ఎగ్జిబిషన్ ను డిపార్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్ (DoT) మరియు సెల్యులార్ ఆపరేషన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) నిర్వహిస్తుంది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2023 ప్రత్యేకత ఏమిటి అని చూస్తే, ఈ సంవత్సరం మరింత విస్తరించనున్న 5G టెక్నాలజీ మరియు నెక్స్ట్ జెనరేషన్ వైర్లెస్ టెక్ అయిన 6G, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) విస్తరణ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, సైబర్ సెక్యూరిటీ, గ్రీన్ టెక్నాలజీ మరియు మరిన్ని టెక్ సంబంధిత ఇన్నోవేషన్ లను మనము ముందుకు తీసుకు వస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu