Ad Code

2050 నాటికి ఏసీల వినియోగం తొమ్మిది రెట్లు పెరుగుతోంది !


ళ్లలో వినియోగిస్తున్న ఏసీల సంఖ్య  2010 నుంచి మూడు రెట్లు పెరిగింది. ప్రస్తుతం దేశంలోని ప్రతి 100 కుటుంబాలలో 24 కుటుంబాలు ఎయిర్ కండిషనర్ వినియోగిస్తున్నాయి. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ రిపోర్ట్ ప్రకారం 2019, 2022 మధ్య కూలింగ్‌ స్పేసెస్‌ ఎనర్జీ కన్సమ్షన్‌ 21 శాతం పెరిగింది. 2050 నాటికి వాషింగ్ మెషీన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్‌ల వంటి ఇతర వస్తువులను అధిగమించి, దేశంలో ఎయిర్ కండిషనర్ల సంఖ్య తొమ్మిది రెట్లు పెరుగుతుందని అంచనా. దీంతో ప్రస్తుతమున్న పరిస్థితులు మరింత తీవ్రమయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. కూలింగ్‌కి పెరుగుతున్న డిమాండ్ కారణంగా దేశం 10% ఎనర్జీ కన్సమ్షన్‌ ఇప్పుడు కూలింగ్‌ కోసం మాత్రమే ఉపయోగిస్తున్నట్లు గమనించడం ముఖ్యం. ఎయిర్ కండిషనింగ్ వినియోగంలో కనిపిస్తున్న పెరుగుదల చిక్కులు దీర్ఘకాలంలో ఎదురవుతాయి. IEA ప్రకారం గత ఐదు దశాబ్దాలలో భారతదేశం 700 హీట్‌వేవ్ సంఘటనలను చూసింది. 17,000 మంది ప్రాణాలను బలిగొన్నాయి. భౌగోళిక, వాతావరణ పరిస్థితులకు ఆజ్యం పోస్తూ, భారతదేశంలో ఎయిర్ కండిషనర్‌ల వినియోగం ఆదాయాలతో క్రమంగా పెరుగుతోంది. 2050 నాటికి భారతదేశంలో కూలింగ్‌ అవసరాల కారణంగా పెరిగిన విద్యుత్ వినియోగం మొత్తం, ఆఫ్రికా ఖండంలోని మొత్తం ఎనర్జీ వినియోగాన్ని అధిగమిస్తుందని IEA హైలైట్ చేసింది.

Post a Comment

0 Comments

Close Menu