23న Y200 వివో 5G ఫోన్ లాంచ్ !
Your Responsive Ads code (Google Ads)

23న Y200 వివో 5G ఫోన్ లాంచ్ !


దేశీయ మార్కెట్లో అక్టోబర్ 23న Y200 వివో 5G ఫోన్ లాంచ్ కానుంది. కంపెనీ రాబోయే ఈ ఫోన్ కలర్ ఆప్షన్స్‌ను టీజ్ చేసింది. ప్రమోషన్ ఇమేజ్ ప్రకారం, ఇది రెండు కలర్ ఆప్షన్స్‌లో రానుంది. ప్రమోషన్ ఇమేజ్‌లో కనిపించిన ఫోన్ కలర్స్ గతంలో లీక్ అయిన వాటికి సరిపోయాయి. ఇటీవల వచ్చిన ఓ రిపోర్ట్ ప్రకారం.. వివో Y200 మోడల్ డెసర్ట్ గోల్డ్, జంగిల్ గ్రీన్ వంటి రెండు కలర్ ఆప్షన్‌లో లాంచ్ కానుంది. మిడ్ రేంజ్ వివో Y200 5G ధర భారత్‌లో రూ.24,000గా ఉండవచ్చు. మార్కెట్‌లో మోటోరోలా ఎడ్జ్‌ 40 నియో, పోకో ఎఫ్‌5, ఇన్ఫినిక్స్‌ జీరో 30 5జీ వంటి స్మార్ట్‌ఫోన్స్‌కు పోటీగా వివో దీన్ని లాంచ్‌ చేస్తుంది. దీనిలో ఆరా లైట్ ఫీచర్‌ ఉంటుంది. ఇప్పటికే ఈ ఫీచర్‌ను వివో వీ29, వివో వీ29 ప్రో మోడల్స్‌లో తీసుకొచ్చింది. ఈ ఫోన్ డ్యుయల్ రియర్ కెమెరా సెటప్‌తో రానుంది. ఇది సింగిల్ స్టోరేజ్ వేరియంట్‌ (8GB RAM+128GB)తో లాంచ్ కావచ్చు. వర్చువల్‌గా ర్యామ్ మరో 8జీబీ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఫోన్‌లో 6.67-అంగుళాల ఫుల్-HD+ AMOLED డిస్‌ప్లే ఉండవచ్చు. ఇది 2,400 x 1,080 పిక్సెల్స్ రిజల్యూషన్, 120 Hz రిఫ్రెష్ రేటును అందిస్తుంది. క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 1 SoC ప్రాసెస్ ద్వారా డివైజ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 13-ఆధారిత Funtouch OSపై రన్ అవుతుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్(OIS)తో రియర్ డ్యుయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌ ఉండవచ్చు. ఫోన్ ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండవచ్చు. ఈ ఫోన్‌లో 44W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ చేసే 4,800mAh బ్యాటరీ ఉండవచ్చు. డివైజ్ బరువు 190 గ్రాములు, మందం 7.69 మి.మీ ఉంటుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Search This Blog