యాపిల్‌ ఐప్యాడ్‌పై 23% డిస్కౌంట్‌ !
Your Responsive Ads code (Google Ads)

యాపిల్‌ ఐప్యాడ్‌పై 23% డిస్కౌంట్‌ !


ఫ్లిప్‌కార్ట్‌లో యాపిల్ ఐప్యాడ్‌పై ఆఫర్‌ లభిస్తోంది. 64 జీబీ కెపాసిటీ, 9th జనరేషన్‌ యాపిల్‌ ఐప్యాడ్‌ అసలు ధర రూ. 33,900గా ఉండగా, ప్రస్తుతం సేల్‌లో భాగంగా 23 శాతం డిస్కౌంట్‌తో రూ. 25,999 లభిస్తోంది. వీటితో పాటు ఐసీఐసీ, యాక్సిస్‌ బ్యాంకులకు చెందిన క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో అదనంగా గరిష్టంగా రూ. 1500 వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు. వీటితో పాటు ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కింద ఏకంగా రూ. 25000 వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు. ఈ ఐప్యాడ్‌ ఐఎఓస్‌ 15తో పని చేస్తుంది. 64 జీబీ స్టోరేజ్‌ దీని సొంతం. ఇందులో 10.2 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 8 మెగాపిక్సెల్స్‌ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 12 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. యాపిల్‌ ఐప్యాడ్‌ ఏ13 బయోనిక్‌ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఇక 3.5 ఎంఎం హెడ్‌ఫోన్‌ జాక్‌, ప్రీమియం మెటల్‌ బాడీని అందించారు.2160×1620 పిక్సెల్స్ రిజల్యూషన్, పీక్ బ్రైట్‌నెస్ 500 నిట్స్ ఈ ఐప్యాడ్ స్క్రీన్‌ సొంతం. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ ఐప్యాడ్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 10 గంటల వీడియో స్ట్రీమింగ్ అందిస్తుంది. ఇక నెట్‌వర్క్‌ విషయానికొస్తే.. వైఫై, వైఫై + సెల్యులార్‌, డ్యూయల్ బ్యాండ్‌ వైఫై (2.4 గిగా హెర్ట్జ్‌, 5 గిగా హెర్ట్జ్‌) అందించారు. ఇక ఈ ఐప్యాడ్‌ బరువు 498 గ్రాములుకాగా డిస్‌ప్లేలో హార్డ్‌ గ్లాస్‌ ప్రొటెక్షన్‌ అందించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Search This Blog