Ad Code

అక్టోబర్ 4న ఐదు ఫోన్లు విడుదల


క్టోబర్ 4న గూగుల్ కొత్త పిక్సెల్ సిరీస్, వివో వి29 సిరీస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ  స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ల్లో లాంచ్ చేయవచ్చు. ఇందులో ప్రారంభ వేరియంట్ ధర రూ.54,999గానూ, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.59,999గానూ ఉండే అవకాశం ఉంది. ఇందులో మీరు 120Hz రిఫ్రెష్ రేట్ను సపోర్ట్ చేసే 6.3 అంగుళాల ఫుల్ హెచ్డీ+ పంచ్ హోల్ డిస్ప్లేను పొందవచ్చు. ఈ స్మార్ట్ఫోన్ స్నాప్డ్రాగన్ 8 జెన్ 1 లేదా ఎక్సినోస్ 2200 చిప్ సెట్ పై పని చేసే అవకాశం ఉంది. ఫోటోగ్రఫీ కోసం ఫోన్ లో వెనకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ అందించారు. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్ కాగా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్ ను సపోర్ట్ చేసే 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కూడా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 10 మెగాపిక్సెల్ కెమెరా ఉండవచ్చు. బ్యాటరీ 25W ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేసే 4,500 ఎంఏహెచ్ ఉంటుంది. గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ లో గూగుల్ పిక్సెల్ 8, గూగుల్ పిక్సెల్ 8 ప్రో స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో లాంచ్ కానున్నాయి. ప్రారంభ మోడల్లో డ్యూయల్ కెమెరా సెటప్  ఉంటుంది. ప్రో మోడల్లో 48 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉండనుంది. మొత్తంగా ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది.  ఈ సిరీస్ ధర రూ. 65,000 నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇక టాప్ ఎండ్ ప్రో మోడల్ ధర దాదాపు రూ. 90,000 వరకు ఉండవచ్చు. గూగుల్ తో పాటు వివో కూడా ఆ రోజు  వివో వీ29 సిరీస్ ను లాంచ్ చేయనుంది. ఇందులో వెనక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 


Post a Comment

0 Comments

Close Menu