Ad Code

సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌ కొత్త కలర్‌ లో విడుదల !


సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎఫ్‌34 పేరుతో ఇప్పటికే ఓ 5జీ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది.  తాజాగా ఈ ఫోన్‌ను మరో కొత్త కలర్‌తో తీసుకొచ్చింది సామ్‌సంగ్‌. 'ఆర్చిడ్ వయొలెట్' కలర్‌తో ఫోన్‌ను కొత్తగా తీసుకొచ్చింది. వీటితో పాటు ఎలక్ట్రిక్‌ బ్లాక్‌, మిస్టిక్‌ గ్రీన్‌ కలర్స్‌లో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ 2023 సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకురానున్నారు. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎఫ్‌34లో 6.5 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్‌ రీఫ్రెష్‌ రేట్‌ ఈ డిస్‌ప్లే సొంతం. ఇక ఈ ఫోన్‌ 5ఎన్‌ఎం ఎక్సినోస్‌ 1280 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 6000 ఎంఏహెచ్‌ వంటి భారీ బ్యాటరీ ఈ ఫోన్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. నో షేక్ ఎమెరా స్పోర్ట్‌ ఫన్‌ మోడ్‌ ఈ కెమెరా ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఇక సెల్ఫీల విషయానికొస్తే ఇందులో 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ స్మార్ట్ ఫోన్‌ పని చేస్తుంది. అక్టోబర్ 8వ తేదీ నుంచి ఈ ఫోన్‌ సేల్‌ ప్రారంభంకానుంది. ఈ స్మార్ట్ ఫోన్‌ బేస్‌ వేరియంట్ 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 19,999గా ఉంది. 

Post a Comment

0 Comments

Close Menu