పండుగ సీజన్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్‌లలో 70-75 శాతం వార్షిక వృద్ధిని సాధిస్తుందని నివేదిక తెలిపింది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ సీఎంఆర్ ప్రకారం ఈ ఏడాది జూలై వరకు దేశీయ మార్కెట్లో 5G హ్యాండ్‌సెట్ షిప్‌మెంట్‌లలో 65 శాతం వృద్ధిని సాధించింది. వాల్యూ-ఫర్ మనీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ. 7,000-రూ. 25,000) 61 శాతం వార్షిక వృద్ధిని సాధించగా, ప్రీమియం 5 జి స్మార్ట్‌ఫోన్‌లు (రూ. 25,000 మరియు అంతకంటే ఎక్కువ) 68 శాతం వృద్ధిని సాధించాయి. భారతదేశంలో 5G షిప్‌మెంట్‌లలో శామ్‌సంగ్ 25 శాతం మార్కెట్ వాటాతో ముందుంది, వివో 14 శాతం మరియు వన్‌ప్లస్ 12 శాతంతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దేశంలో ఈ సంవత్సరం సుమారు 150 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్‌లు జరగవచ్చని అంచనా వేయబడింది, గత సంవత్సరం (112 లాంచ్‌లు) కంటే 34 శాతం పెరుగుదల కనిపించనుంది. 2023 రెండవ త్రైమాసికంలో భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 6 శాతం క్షీణత ఉన్నప్పటికీ. 5G స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్‌లు 45 శాతం వృద్ధి చెందాయి తాజా ఎరిక్సన్ కన్స్యూమర్ ల్యాబ్ నివేదిక ప్రకారం 2023లో సుమారు 31 మిలియన్ల మంది భారతీయ వినియోగదారులు 5G ఫోన్‌లకు అప్‌గ్రేడ్ అవుతారని భావిస్తున్నారు. 4Gతో పోలిస్తే భారతదేశంలో 5G నెట్‌వర్క్ సంతృప్తి కరంగా, ఆకట్టుకునే విధంగా ఉండటంతో వినియోగదారులు 5జి వైపు అడుగులు వేస్తున్నట్టు నివేదిక తెలిపింది.
పండుగ సీజన్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్ల ప్రభంజనం !
0
October 09, 2023
Tags