మార్కెట్లోకి సీఎస్ఆర్ 762 ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ !
Your Responsive Ads code (Google Ads)

మార్కెట్లోకి సీఎస్ఆర్ 762 ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ !


హ్మదాబాద్ కు చెందిన స్టార్టప్ కంపెనీ స్విచ్ మోటో కార్ప్ నుంచి సరికొత్త సిఎస్ఆర్ 762 ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ను ఆవిష్కరించబోతోంది. మరో మూడు నెలల్లో ఈ బైక్ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇంధన ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో మరొకవైపు పర్యావరణ పరిరక్షణలో భాగంగా చాలా వాహన తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోని చాలామంది కస్టమర్లు కూడా ఇలా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ నేపద్యంలోనే కస్టమర్ల అభివృద్ధికి అనుగుణంగా అదునాతన డిజైన్లతో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నారు. ఇకపోతే స్టార్ట్ అప్ కూడా ఈ రంగంలో కడుగు పెట్టి ఊహించని సేల్స్ తో దూకుడు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో స్టార్టప్ నుంచి ఇంకొక కొత్త బైక్ త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ కానుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో స్విచ్ మోటోకార్ప్ తాజాగా కొత్త సిఎస్ఆర్ 762 ఎలక్ట్రిక్ బైక్ ను విడుదల చేయబోతోంది. ఇక ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ తయారీకి స్విచ్ సంస్థ రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. అంతేకాదు అత్యున్నత క్వాలిటీ మెరుగైన పనితీరుతో హై స్టాండర్డ్ ప్రమాణాలకు అనుగుణంగా ఈ బైక్ ని రూపొందించినట్లు స్పష్టం చేసింది సంస్థ. దీని ప్రత్యేకతల విషయానికి వస్తే సిగ్నేచర్ ఎల్ ఈ డి , డీ ఆర్ ఎల్ డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తంగా ఇతర సంస్థలకు చెందిన ఎలక్ట్రిక్ బైకులతో పోల్చుకుంటే ఈ సరికొత్త బైక్ ఇంకొత్తగా ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది. 3kW PMS ఎలక్ట్రిక్ మోటార్ ను కలిగి ఉంటుంది.3, 800 RPM వద్ద 13.4 bhp గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది అలాగే గరిష్టంగా 165 టార్కును కూడా ఉత్పత్తి చేస్తుంది గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈ బైక్ ప్రయాణిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్లో 40 లీటర్ బూట్ స్పేస్ మొబైల్ చార్జర్ పూర్తిగా కవర్ అయిన మొబైల్ హోల్డర్ తో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇకపోతే చాలా స్టైలిష్ గా ఉండే ఈ బైక్ చెన్నై, హైదరాబాద్ , బెంగళూరు నగరాల షోరూంల ద్వారా విక్రయవాలు జరుపనున్నట్లు సమాచారం.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Search This Blog