Ad Code

శామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ A9, ట్యాబ్ A9+ విడుదల


దేశీయ మార్కెట్లోకి శామ్‌సంగ్ మరో రెండు కొత్త టాబ్లెట్స్ లాంచ్ చేసింది. శామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ A9, ట్యాబ్ A9+ ప్రొడక్ట్స్ తాజాగా ఇండియాలో రిలీజ్ అయ్యాయి. వీటిలో కంపెనీ అడ్వాన్స్‌డ్ ఫీచర్లను అందించింది. గెలాక్సీ ట్యాబ్ A9+ డివైజ్ 1,200 x 1,920 పిక్సెల్ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేసే 11-అంగుళాల IPS LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ట్యాబ్‌ ఆండ్రాయిడ్ 13, వన్ UI 5.1 OS ప్లాట్‌ఫామ్‌తో రన్ అవుతుంది. క్వాల్‌కామ్ SM6375 స్నాప్‌డ్రాగన్ 695 5G చిప్ సెట్‌ పనితీరు యూజర్లను ఆకట్టుకుంటుంది. 8GB RAM, 128GB స్టోరేజ్ ఈ టాబ్లెట్‌ సొంతం. మైక్రో SD ద్వారా స్టోరేజ్‌ను మరింత ఎక్స్‌టెంట్ చేసుకోవచ్చు. గెలాక్సీ ట్యాబ్ A9+లో 8MP రియర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా ఉంటాయి. దీంట్లో 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే Li-Po 7040 mAh భారీ బ్యాటరీ ఉంటుంది. ఇది యూజర్లకు మంచి బ్యాకప్ అందిస్తుంది. 10.12 x 6.64 x 0.27 అంగుళాల డైమెన్షన్స్‌తో దీని డిజైన్ సైతం అట్రాక్టివ్‌గా ఉంది. గెలాక్సీ ట్యాబ్ A9 మోడల్ 800 x 1,340 px రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేసే 8.7 అంగుళాల IPS LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ట్యాబ్‌ ఆండ్రాయిడ్ 13, వన్ UI 5.1 OSతో రన్ అవుతుంది. మీడియాటెక్ హీలియో G99 చిప్‌సెట్‌తో ఇది మంచి పర్ఫార్మెన్స్ అందిస్తుంది. దీంట్లోని 4GB RAM, 64GB స్టోరేజ్ యూజర్ల అవసరాలకు సరిపోతాయి. గెలాక్సీ ట్యాబ్ A9లో 8MP బ్యాక్ కెమెరా, 2MP ఫ్రంట్ కెమెరా ఉంటాయి. డివైజ్‌లో 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5,100 mAh LiPo నాన్-రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. 8.31 x 4.91 x 0.31 అంగుళాల కొలతలతో ఇది కాంప్యాక్ట్ ట్యాబ్‌గా కనిపిస్తోంది. డివైజ్‌లో మైక్రో SD కార్డ్ స్లాట్‌ సైతం ఉంటుంది. దీనితో స్టోరేజ్‌ను మరింత ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. సరికొత్త గెలాక్సీ ట్యాబ్ A9, ట్యాబ్ A9+ టాబ్లెట్లు ప్రస్తుతం కొనసాగుతున్న అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్‌లో అందుబాటులో ఉన్నాయి. రెండు మోడల్స్ డార్క్ బ్లూ, గ్రే, సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. అమెజాన్ ఆఫర్ల ప్రకారం, గెలాక్సీ ట్యాబ్ A9, 4GB RAM + 64GB స్టోరేజ్, Wi-Fi ఓన్లీ వేరియంట్‌ ధర రూ.12,999. ఇదే ట్యాబ్ Wi-Fi + 5G వేరియంట్‌ ధర రూ.15,999గా లిస్ట్ అయింది. గెలాక్సీ ట్యాబ్ A9+ ప్రొడక్ట్ 8GB RAM + 128GB స్టోరేజ్, Wi-Fi ఓన్టీ వేరియంట్ ధర అమెజాన్‌లో రూ.20,999గా ఉంది. ఈ టాబ్లెట్ Wi-Fi + 5G వేరియంట్ ధర వివరాలు ప్రస్తుతం పోర్టల్‌లో అందుబాటులో లేవు.

Post a Comment

0 Comments

Close Menu