గూగుల్ యూజర్లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు, టూల్స్ పరిచయం చేస్తోంది. ఇప్పటికే ఆండ్రాయిడ్ గూగుల్ యాప్, ఐఓఎస్ గూగుల్ యాప్‌తో పాటు సెర్చ్ లాబ్స్‌లో "జనరేటివ్ AI-పవర్డ్ సెర్చ్ ఎక్స్‌పీరియన్స్" పేరుతో ఒక సెర్చ్ టూల్ తీసుకువచ్చింది. ఎలాంటి రిక్వెస్ట్ నుంచైనా ఇమేజ్‌లు క్రియేట్ చేయగల జనరేటివ్ AIని ఈ ఏఐ-పవర్డ్ సెర్చ్ ఇంజిన్‌లో అందించింది. ఈ ఏఐ సర్వీస్ ఇండియాలో అందుబాటులో ఉంది కానీ జనరేటివ్ ఏఐ ఇమేజ్‌లు క్రియేట్ చేయగల ఫెసిలిటీ ప్రస్తుతానికి యూఎస్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. జనరేటివ్ AI అనేది ఒక రకమైన కృత్రిమ మేధ. ఇది ఇమేజ్‌లు, టెక్స్ట్, మ్యూజిక్ మొదలైన కొత్త, ఒరిజినల్ కంటెంట్‌ను ప్రొడ్యూస్ చేయగలదు. ఇమేజ్ ఎలా కావాలో అలా పొందడానికి యూజర్లు ఐడియాలను టెక్స్ట్ రూపంలో ఎంటర్ చేస్తే చాలు, ఈ ఫీచర్ ఇమేజ్‌ను క్రియేట్ చేసి ఇస్తుందని గూగుల్ చెబుతోంది. అయితే వెబ్ వెర్షన్‌లో ఈ స్పెసిఫికేషన్ అందుబాటులో ఉండదు. ముందు గూగుల్ యాప్ (ఆండ్రాయిడ్ లేదా iOS) లేటెస్ట్ వెర్షన్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. గూగుల్ అకౌంట్‌కు సైన్ ఇన్ చేయాలి. డెస్క్‌టాప్ యూజర్లు క్రోమ్ బ్రౌజర్ వాడాలి. బ్రౌజర్ హోమ్ పేజీ పైభాగంలో కనిపిస్తున్న ల్యాబ్స్ ఐకాన్‌పై క్లిక్ చేయాలి. SGE కార్డ్ ఎక్స్‌పరిమెంట్ స్విచ్ ఆన్ చేసి, కండిషన్స్ యాక్సెప్ట్ చేయాలి. - SGE ఎక్స్‌పరిమెంట్ ఆన్ చేసిన తర్వాత, గూగుల్‌లోని ఇమేజెస్ ట్యాబ్‌కు వెళ్లి, జనరేటివ్ AIతో ఇమేజెస్ క్రియేట్ చేసే ఆప్షన్ కోసం వెతికి దాన్ని ఉపయోగించడం ప్రారంభించవచ్చు. "మినిమలిస్ట్ హాలోవీన్ టేబుల్ సెట్టింగ్స్" లేదా "స్పూకీ డాగ్ హౌస్ ఐడియాలు" వంటి క్రియేటివ్ ఇమేజెస్ కోసం వెతుకుతున్నప్పుడు మాత్రమే ఈ ఆప్షన్ కనిపిస్తుంది. - రిక్వెస్ట్ టైప్ చేసి, ఇమేజ్ క్రియేట్ బటన్‌పై నొక్కాలి. మీ రిక్వెస్ట్‌కు మ్యాచ్ అయ్యేలా ఇమేజ్‌ను రూపొందించడానికి గూగుల్ జనరేటివ్ AIని ఉపయోగిస్తుంది. ఈ ఇమేజ్‌ను కావలసిన విధంగా ఎడిట్ చేయవచ్చు, సేవ్ చేయవచ్చు లేదా షేర్ చేయవచ్చు. దీన్ని ఉపయోగించడానికి 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి. ఈ ఫీచర్ ప్రస్తుతం మొబైల్, డెస్క్‌టాప్ డివైజెస్‌లో యూఎస్‌లోని ఇంగ్లీష్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. జెనరేటివ్ AI క్రియేట్ చేసే ఇమేజ్‌లు నిజమైనవి కావని, ఎలాంటి చట్టవిరుద్ధమైన లేదా అనైతిక ప్రయోజనాల కోసం ఉపయోగించరాదని కూడా గూగుల్ హెచ్చరిస్తుంది. నిర్దిష్ట రకాల అభ్యర్థనలు, కంటెంట్‌ను బ్లాక్ చేసేలా ఏఐ కోసం గూగుల్ ప్రోహిబిటెడ్ యూజ్ పాలసీని కూడా కలిగి ఉంది.
గూగుల్ యూజర్లకు జనరేటివ్ AI-పవర్డ్ సెర్చ్ ఎక్స్‌పీరియన్స్ !
0
October 14, 2023
Tags