బెంగళూరు వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ ఆపిల్ సంస్థకు రూ. లక్ష పెనాల్టీ విధించింది. బెంగళూరుకు చెందిన వాజ్ ఖాన్ (30) అనే వ్యక్తి 2021 అక్టోబర్ 29న ఐఫోన్13 కొనుగోలు చేశాడు. ఈ ఫోన్ మీద ఆపిల్ ఏడాది వారంటీ ఇచ్చింది. కొనుగోలు చేసిన కొన్ని నెలలకే ఆ ఫోన్ బ్యాటరీ, స్పీకర్‌తో సమస్యలు రావడంతో దాని మరమ్మతు కోసం 2022 ఆగస్టు 25న స్థానిక సర్వీస్ సెంటర్‌లో ఇచ్చాడు. ఆగస్టు 30వ తేదీన సర్వీస్ సెంటర్ నుంచి ఫోన్ వచ్చింది.. 'మీ ఐ-ఫోన్‌లో లోపం సరి చేశామని, ఫోన్ తీసుకెళ్లవచ్చునని` ఆ ఫోన్ కాల్ చేసిన వారు చెప్పారు. కానీ ఫోన్‌లో లోపం యధాతథంగానే కొనసాగుతున్నదని, తిరిగి సర్వీస్ సెంటర్ వారికి ఇచ్చారు. రెండు వారాల్లో మరమ్మతు చేసి ఇస్తామని సర్వీస్ సెంటర్ నిర్వాహకులు సమాధానమిచ్చారు. కానీ రెండు వారాలు దాటినా వాజ్ ఖాన్‌కు ఎటువంటి సమాధానం రాలేదు. తర్వాత తీరిగ్గా.. ఆయన కొన్న 'ఐ-ఫోన్ 13'లో ఔటర్ మెష్‌లో జిగురు పదార్థం ఉందని, వారంటీలో దాన్ని తొలగించలేమని, తొలగించాలంటే, అదనంగా మనీ చెల్లించాలని సర్వీస్ సెంటర్ నిర్వాహకులు తీరిగ్గా చెప్పారు. దీనిపై పలుమార్లు ఆపిల్ సంస్థకు ఈ-మెయిల్స్ పంపినా స్పందన కరువైంది. గతేడాది అక్టోబర్ 27న ఆపిల్‌కు లీగల్ నోటీసు కూడా పంపాడు. తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో 2022 డిసెంబర్‌లో జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ జరిపిన కమిషన్.. వాజ్ ఖాన్ కు పరిహారం చెల్లించాలని ఆపిల్, ఆ సంస్థ సర్వీస్ భాగస్వామిని ఆదేశించింది. రూ.79,900 పరిహారంతోపాటు మరో రూ.20 వేలు వడ్డీ చెల్లించాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది.
వారంటీ తిరస్కరించినందుకు ఆపిల్ సంస్థకు రూ. లక్ష జరిమానా !
0
October 01, 2023
Tags