Ad Code

కంపెనీ సీఈఓగా ఏఐ రోబోట్ మికా !


పోలాండ్ కు చెందిన మత్తు పానీయాలు తయారు చేసే కంపెనీ మికా హ్యుమనోయిడ్ రోబోను డిక్టేడార్ కు ప్రయోగాత్మక సీఈఓగా నియమించింది. ఈ కంపెనీ రమ్ కు ప్రసిద్ధి చెందింది. దీనిలో రోబో సంస్థ అభివృద్ధిని పర్యవేక్షిస్తుంది, ఇందులో వన్-ఆఫ్ కలెక్షన్లు, కమ్యూనికేషన్లు, వ్యూహాత్మక ప్రణాళికలు కూడా ఉంటాయి. డిక్టేడార్‌లోని యూరప్ హెడ్ మార్క్ స్జోల్డ్‌రోవ్స్కీ ప్రకారం, “డిక్టేడార్ బోర్డు నిర్ణయం విప్లవాత్మకమైనది, సాహసోపేతమైనదిగా అభివర్ణించారు. కంపెనీ అభివృద్ధి చేసిన ఏఐతో కూడిన ఈ మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబోట్ ఓ కొత్త విప్లవాన్ని తీసుకొస్తుందన్నారు. ఈ మికా రోబో కస్టమ్ బాటిళ్లను రూపొందించడానికి కళాకారులను ఎంపిక చేయడంపై ప్రధానంగా దృష్టి పెడుతుంది. సంస్థ అన్ని ముఖ్యమైన నిర్ణయాలను ఈ రోబోట్ తీసుకుంటుంది. లాభనష్టాలు, మార్కెటింగ్ వ్యూహం, వ్యాపార వ్యూహం సహా అన్ని విషయాలను ఈ ఏఐ చూసుకుంటుంది. కంపెనీకి మరింత మార్కెటింగ్‌కు ఎలా ముందుకు వెళ్లాలో ఇది నిర్ణయిస్తుంది. ఎక్కడ పెట్టుబడులు లాభపడతాయో అంచనా వేస్తుంది. అంతేకాదు ఈ మికా ఆఫీసు లోపల కూడా సందడి చేస్తుంది. అంటే ఏ డిపార్ట్ మెంట్ పని బాగా జరుగుతోందని, ఎవరు పని సరిగా చేయడం లేదనే విషయాలను ఈ రోబో గమనిస్తూనే ఉంటుంది. ఏ వర్కర్ ఎక్కడ అవసరం, పని పరిధి ఎలా ఉంటుందో మికానే చెబుతుంది. ప్రతి కార్మికుడి పనితీరును తనిఖీ చేస్తుంది. ప్రతి ఉద్యోగి ప్రమోషన్-ఇంక్రిమెంట్ ఈ కృత్రిమ మేధస్సు రోబో చేతిలో ఉంటుంది. సంస్థ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పుడు యావత్ ప్రపంచం దీనిపై దృష్టి సారించింది.

Post a Comment

0 Comments

Close Menu