Ad Code

ఫ్లిప్ మోడల్‌లో నోకియా ఫోన్ !


నోకియా 2660 ఫ్లిప్ ఫోన్‌ క్లాసిక్ మోడల్లో UPI స్కాన్, పే ఫంక్షనాలిటీని తన క్లాసిక్ మోడల్ నోకియా 2660 ఫ్లిప్ ఫోన్‌లో ప్రవేశపెట్టింది. దీని ద్వారా, వినియోగదారులు ఒకే బటన్ నొక్కడం ద్వారా సురక్షితమైన, సౌకర్యవంతమైన డిజిటల్ లావాదేవీలు చేయవచ్చు. నోకియా 2660 ఫ్లిప్ కొత్త ఫోన్ కొనేవారికి ఈ ఫీచర్ ఇన్‌బిల్ట్‌గా ఉంటుంది. ఐతే, పాత వినియోగదారులు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసుకోవడం ద్వారా ఈ ఫీచర్‌ని పొందవచ్చు. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా డిజిటల్ చెల్లింపు ఆప్షన్లు అందరికీ అందుబాటులో ఉండేలా చేసింది కంపెనీ. నోకియా ఫోన్‌లు రెండు కొత్త రంగులలో కూడా అందుబాటులో ఉన్నాయి: పాప్ పింక్, లష్ గ్రీన్. నోకియా 2660 ఫ్లిప్ ఫోన్ క్లాసిక్‌ని తగినంత మన్నికైన స్టైలిష్ డిజైన్‌లో విడుదల చేశారు. నోకియా 2660 ఫ్లిప్ ఫోన్... బ్లాక్, రెడ్, బ్లూ అనే మూడు విభిన్న రంగులలో రూ.4,699కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ని నోకియా ఆన్‌లైన్ స్టోర్ ద్వారా లేదా రిటైల్ షోరూమ్, ఆన్‌లైన్‌లో కొనవచ్చు. ఈ ఫోన్ 2.8 అంగుళాల డిస్‌ప్లే, చక్కటి వినికిడితో వచ్చింది. అదనంగా, 1450mAh బ్యాటరీ కలిగివుంది. ఈ బ్యాటరీని తొలగించుకోవచ్చు. ఈ ఫోన్‌లో ఎమర్జెన్సీ బటన్ ఆప్షన్ ఉంది. దాని ద్వారా 5 ఎమర్జెన్సీ కాంటాక్ట్‌లను స్టోర్ చేసుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ బటన్‌ను నొక్కడం ద్వారా.. ఆ ఐదుగురికీ మీరు ఆపదలో ఉన్న సమాచారం వెళ్తుంది. ఈ ఫోన్ అంతరాయం లేని నెట్‌వర్క్‌ను అందించడానికి VoLTE సపోర్ట్‌తో డ్యూయల్ 4G కనెక్టివిటీ కలిగివుంది. ఫంక్షనాలిటీ విషయానికొస్తే, మైక్రో SD కార్డ్‌లు, స్టోరేజ్‌ని పెంచుకునే ఆప్షన్లు ఉన్నాయి. ఈ ఫోన్ సిరీస్ 30+ ఆపరేటింగ్ సిస్టమ్‌లతో రన్ అవుతుంది. ఈ నోకియా ఫోన్‌కి VGA కెమెరా ఉండగా, FM రేడియో సపోర్ట్ కూడా ఉంది.

Post a Comment

0 Comments

Close Menu