ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను ఉపయోగించి స్మార్ట్ ఫోన్ తోనే నోటి క్యాన్సర్ (ఓరల్ క్యాన్సర్)ను గుర్తించవచ్చు. దీనిపై ఐహబ్ డాటా, ఐఎన్ఏఐతో కలిసి నిర్వహించిన ప్రాథమిక అధ్యయనంలో మంచి ఫలితాలు వచ్చినట్లు గచ్చిబౌలిలోని ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అధికారులు పేర్కొన్నారు. ఏఐ సాయంతో పలు సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనేందుకు ప్రముఖ చిప్ కంపెనీ ఇంటెల్ ఐఎన్ఏఐ పేరుతో ట్రిపుల్ ఐటీలో ఓ రిసెర్చ్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. ఇందులో ట్రిపుల్ ఐటీ విద్యార్థులు నోటిలోని గాయాలను గుర్తించేందుకు కృత్రిమ మేధస్సుతోపాటు మెషీన్ ల్యాంగ్వేజ్ లను ఉపయోగించి ప్రత్యేక మొబైల్ యాప్ ను రూపొందించారని ఐఎన్ఏఐ సీఈవో కోనాల వర్మ తెలిపారు. ఈ యాప్ సాయంతో నోటి క్యాన్సర్ ను ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చని వెల్లడించారు. ప్రయోగ దశలో విజయవంతమైన ఈ విధానాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు.
0 Comments