స్మార్ట్‌ఫోన్లను టెక్ బ్రాండ్స్ సరికొత్త రూపంలో అందిస్తున్నాయి. కెమెరా, బ్యాటరీ, ప్రాసెసర్ పరంగా ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయడం కొత్తేంకాదు. కానీ ఇప్పుడు మడతపెట్టగలిగే కాంపాక్ట్ డివైజ్‌గా స్మార్ట్‌ఫోన్లు సరికొత్త రూపంలో వస్తున్నాయి. వీటిని ఓపెన్ చేస్తే, స్క్రీన్ సైజ్ ఏమాత్రం తగ్గకుండా పెద్ద డిస్‌ప్లే కనిపిస్తుంది. ఫోల్డ్ చేస్తే చాలా చిన్న డివైజ్‌గా కనిపిస్తుంది. శామ్‌సంగ్, ఒప్పో , వన్‌ప్లస్ వంటి బ్రాండ్లు ఫోల్డబుల్ ఫోన్ సెగ్మెంట్‌పై పూర్తిగా దృష్టి పెట్టాయి. వచ్చే ఏడాది మరికొన్ని బ్రాండ్స్ ఫోల్డబుల్ లేదా రోలబుల్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకురానున్నాయి. ఇవి ఈ ఏడాదే మెయిన్ స్ట్రీమ్ మార్కెట్ స్థాయికి చేరుకోవచ్చని అంచనాలు ఉన్నా 2024లో ఫోల్డబుల్ ఫోన్లకు డిమాండ్ పెరగవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఫోల్డబుల్ సెగ్మెంట్‌లో శామ్‌సంగ్ ఇప్పటికే పైచేయి సాధించింది. అయితే కంపెనీ ఈ డివైజ్‌లలో కచ్చితంగా అప్‌డ్రేడ్స్, ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి. లేదంతే కెమెరాల కోసం జీస్ ఆప్టిక్స్‌ను డెవలప్ చేసిన వివో వంటి బ్రాండ్లదే మార్కెట్లో పైచేయి కావచ్చు. వివో, ట్రాన్షన్ వంటి బ్రాండ్లు వచ్చే ఏడాది ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరించవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఈ రెండు బ్రాండ్ల నుంచి ఫోన్లు మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంటాయని, ఇవి ప్రోటోటైప్స్ కాదని లేటెస్ట్ రిపోర్ట్ ఒకటి పేర్కొంది. దీంతో ఫోల్డబుల్ సెగ్మెంట్‌కు ఇది పెద్ద మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ డివైజ్‌లు ఎక్స్‌పాండబుల్ స్క్రీన్‌తో వస్తాయి. బటన్‌ను నొక్కితే రోల్ ఓవర్ అవుతాయి. ఈ ఫోన్లను 2024 చివరి నాటికి ప్రదర్శించి, 2025 ప్రారంభంలో రిలీజ్ చేయవచ్చని నివేదిక తెలిపింది. ట్రాన్షన్ హోల్డింగ్స్ కంపెనీకి ఐటైల్ , టెక్నో, ఇన్‌ఫినిక్స్ వంటి సంస్థలు సబ్ బ్రాండ్స్‌గా ఉన్నాయి. టెక్నో ఇప్పటికే మార్కెట్‌లో రూ.1 లక్షలోపు ఫోల్డబుల్ ఫోన్లను, రూ. 50,000 లోపు ఫ్లిప్ ఫోన్‌లను లాంచ్ చేసింది. వివో కంపెనీ ప్రీమియం ఎక్స్ సిరీస్ ఫోన్లను పవర్‌ఫుల్ కెమెరాలతో విడుదల చేసి, మార్కెట్‌లో ప్రత్యేకత చాటుకుంది. త్వరలో ఫోల్డబుల్ ఫోన్‌ను తీసుకురావడంపై కంపెనీ నిమగ్నమైంది. అయితే వివిధ కంపెనీల నుంచి ఫోల్డబుల్, ఫ్లిప్ ఫోన్లు వేర్వేరు బడ్జెట్ ఆప్షన్లలో రిలీజ్ అయి, అవి కస్టమర్లకు చేరువ అయితేనే ఈ సెగ్మెంట్ సక్సెస్ అవుతుందని టెక్ ఎక్స్‌పర్ట్స్ విశ్లేషిస్తున్నారు.
ఫోల్డబుల్ ఫోన్లపై టెక్ కంపెనీల దృష్టి !
0
October 12, 2023
Tags