అమెజాన్‌ లో జియోబుక్‌ పై పండుగ ఆఫర్ !
Your Responsive Ads code (Google Ads)

అమెజాన్‌ లో జియోబుక్‌ పై పండుగ ఆఫర్ !


రిలయన్స్ జియో జులై నెలలో జియోబుక్‌  పేరిట ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. ఆగస్టు నుంచి వీటిని సేల్‌కు అందుబాటులో ఉంచింది. విడుదల సమయంలో ఈ ల్యాప్‌ ధర రూ.16,499గా ఉంది. ఈ పండుగ సీజన్‌లో లిమిటెడ్‌ పిరియడ్‌ ఆఫర్‌ కింద ఈ ల్యాప్‌టాప్‌లపై డిస్కాంట్‌ను ప్రకటించింది. విడుదల సమయంలో జియోబుక్‌ ధర రూ.16499గా ఉంది. ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ద్వారా కొనుగోలు చేస్తే రూ.1500 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా ఈ బుక్‌ను రూ.14,999కే కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ ఈ ల్యాప్‌టాప్‌ కొనుగోలుపై అదనపు బ్యాంక్‌ ఆఫర్లు, EMI ఆఫర్లు ఇవ్వనుంది. ఫలితంగా మరింత తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. జియో బుక్‌ స్పెసిఫికేషన్లు జియోబుక్ ల్యాప్‌టాప్‌ 4G కనెక్టివిటిని కలిగి ఉంటుంది. మరియు విద్యార్థులు, విద్యా సంబంధ అవసరాలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని జియో వెల్లడించింది. ఈ ల్యాప్‌ 11.6 అంగుళాల HD యాంటీ గ్లేర్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతోపాటు మీడియాటెక్‌ MT 8788 ఆక్టాకోర్‌ /2.0 GHz/ ARM V8-A 64-bit ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. మరియు 4GB ర్యామ్‌, 64GB స్టోరేజీని కలిగి ఉంటుంది. మైక్రో SD కార్డుతో స్టోరేజీని 256 GB వరకు పెంచుకొనే అవకాశం ఉంది. ఈ జియోబుక్‌ ల్యాప్‌టాప్‌ Jio OS అపుట్‌ ఆఫ్‌ ది బాక్స్‌పైన పనిచేస్తుంది. ఈ OS 75కు పైగా షార్ట్‌కట్స్‌, యాప్స్, ఎక్స్‌టెండెట్ డిస్‌ప్లే, టచ్‌ప్యాడ్‌ గెస్చర్‌లు సహా మరిన్నింటిని కలిగి ఉంటుంది. ఈ ల్యాప్‌ 8 గంటల బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది. మరియు స్టీరియో స్పీకర్ల, ఇన్ఫినిటి కీబోర్డు, పెద్ద టచ్‌ప్యాడ్‌ను కలిగి ఉంటుంది. ఈ జియోబుక్‌ ల్యాప్‌టాప్‌ ఇన్‌బిల్ట్‌ 4G సిమ్‌ కార్డును కలిగి ఉంటుంది. అయితే వినియోగదారులు ఆ సిమ్‌ కార్డును జియో వెబ్‌సైట్‌ లేదా జియో యాప్‌ ద్వారా యాక్టివేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జియో ల్యాప్‌ డ్యూయల్‌ బ్యాండ్‌ Wi-fi ను సపోర్టు చేస్తుంది. ఈ జియోబుక్ మాట్టే ఫినిష్‌ తరహా ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. మరియు వేగవంతమైన పనితీరును కనబరుస్తుంది. అల్ట్రా స్లిమ్‌ బిల్డ్‌తో తక్కువ బరువును కలిగి ఉంటుంది. వైర్‌లెస్‌ ప్రింటింగ్‌, మల్టీ టాస్కింగ్‌ స్క్రీన్‌, ఇంటిగ్రేటెడ్‌ చాట్‌బోట్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. జియో క్లౌడ్‌ ద్వారా గేమ్స్‌ ఆడేందుకు అవకాశం ఉంది. JioBIAN కోడింగ్‌తో విద్యార్థులు c/c++, Java, Python, perl వంటి వివిధ భాషల్లో కోండింగ్‌ నేర్చుకోవచ్చు.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Search This Blog