నాయిస్ లూనా స్మార్ట్ రింగ్‌ను ఆవిష్కరించింది. ఈ లూనా స్మార్ట్ రింగ్ టైటానియం బాడీని కలిగి, డైమండ్ పూతతో వస్తుంది. ఎక్కువకాలం మన్నిక వచ్చే విధంగా మరియు గీతలు, తుప్పు పట్టకుండా కాపాడుతుంది. నాయిస్ లూనా రింగ్ ప్రారంభ ధర రూ.14,999గా ఉంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ రింగ్ gonoise.com లో అందుబాటులో ఉంది. ఈ లూనా రింగ్ మూడు రంగుల్లో లభిస్తుంది. స్టార్‌డస్ట్ సిల్వర్, మిడ్‌నైట్ బ్లాక్, లూనార్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రంగులతోపాటు సన్‌లిట్ గోల్డ్, రోజ్ గోల్డ్ రంగుల్లోనూ త్వరలో అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది. ఈ లూనా స్మార్ట్ రింగ్‌ను ఆర్డర్ చేశాక.. కస్టమర్ చేతి వేళ్ల సైజ్‌ను నిర్ణయించడానికి సైజింగ్ కిట్ వస్తుంది. అనంతరం రెండు నుంచి నాలుగు వారాల్లో స్మార్ట్ రింగ్ డెలివరీ అవుతుంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 5 శాతం తగ్గింపును మరియు నో కాస్ట్ EMI సదుపాయాన్ని పొందవచ్చు. లూనా యాక్సెస్ పాస్‌ను కొనుగోలు చేసిన వారు అదనంగా రూ.3000 తగ్గింపును పొందుతారు. ఫిజికల్, లిక్విడ్ డ్యామేజ్ కవరేజ్ కింద మరియు నాయిస్ ఐ స్మార్ట్ కళ్లజోడుపై రూ.2000 తగ్గింపును పొందవచ్చు. ఈ స్మార్ట్ రింగ్ ప్రస్తుతం సేల్‌కు అందుబాటులో ఉంది. లూనా స్మార్ట్ రింగ్ కేవలం 3 నుంచి 4 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. మరియు 2.8mm మందం ఉంటుంది. ఈ స్మార్ట్ రింగ్ హార్ట్ రేట్, శరీర ఉష్ణోగ్రత, SpO2 మానిటర్, స్లీప్, యాక్టివిటీ ట్రాకింగ్ సహా అనేక ఆరోగ్యానికి సంబంధించిన ట్రాకింగ్ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ ఫలితాలను నాయిస్‌ఫిట్ యాప్ ద్వారా ట్రాకింగ్ చేయవచ్చు. ఈ నాయిస్ స్మార్ట్ రింగ్ తక్కువ శక్తిని వినియోగించుకొనే టెక్నాలజీని కలిగి ఉంటుంది. మరియు ఈ రింగ్ ఆండ్రాయిడ్ 6+ మరియు iOS 14 లేదా తర్వాత వెర్షన్‌లను సపోర్టు చేస్తుంది. ఈ రింగ్ 50 మీటర్ల లోతు నీటి వరకు వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంటుంది. 90 నుంచి 120 నిమిషాల్లో పూర్తి ఛార్జింగ్ చేయవచ్చని సంస్థ చెబుతోంది. సింగిల్ ఛార్జింగ్‌తో 6 రోజులపాటు ఈ స్మార్ట్ రింగ్ బ్యాటరీ లైఫ్ వస్తుందని తెలిపింది. ఈ రింగ్ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని నాయిస్ సంస్థ చెబుతోంది. ఈ రింగ్ హార్ట్ రేట్ మానిటర్, SpO2 సెన్సార్, శరీర ఉష్ణోగ్రతను కొలిచే సెన్సార్‌లను కలిగి ఉంటుందని బోట్ తెలిపింది. దీంతోపాటు నిద్ర నాణ్యత సహా ఇతర ఫీచర్లను కలిగి ఉంటుంది. మహిళల రుతుక్రమాన్ని ట్రాకింగ్ చేయగలదని తెలిపింది. ఈ రింగ్ 5 ATM వాటర్ రెసిస్టెంట్ రేటింగ్‌తో వస్తుంది. సింగిల్ ఛార్జింగ్‌తో 7 రోజుల బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది. ఈ రింగ్ రన్నింగ్, వాకింగ్, రైడింగ్, ఇండోర్, అవుట్‌డోర్ ట్రాకింగ్ సహా అనేక రకాల వ్యాయామాలను ట్రాక్ చేయగలదు. ఈ సమాచారాన్ని బోట్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ స్మార్ట్ రింగ్ శరీర కదలికలను గుర్తించేందుకు వీలుగా ఆరు యాక్సిస్ మోషన్ సెన్సార్‌లను కలిగి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల కోసం SOS మోడ్‌తో వస్తుంది. ఈ బోట్ స్మార్ట్ రింగ్ ధర రూ.8,999గా ఉంది.
నాయిస్ లూనా స్మార్ట్ రింగ్ ఆవిష్కరణ !
0
October 05, 2023
Tags