Ad Code

థ్రెడ్స్ యాప్‌లో ఎడిట్ ఫీచర్ !


మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ థ్రెడ్స్ పోస్ట్‌లను ఉచితంగా ఎడిట్ చేసుకునే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. థ్రెడ్స్‌ అకౌంట్స్‌లో కొత్త ఫీచర్‌ను మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. "ఈరోజు ఎడిట్, వాయిస్ థ్రెడ్స్‌ ను విడుదల చేస్తున్నాం. ఎంజాయ్" అని జుకర్‌బర్గ్ అన్నారు. థ్రెడ్స్‌కు ప్రధాన పోటీదారు ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఎడిట్ ఫీచర్‌ను కేవలం పెయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంచింది. థ్రెడ్స్‌ మాత్రం పబ్లిష్ చేసిన ఐదు నిమిషాల లోపు పోస్ట్‌లను ఫ్రీగా ఎడిట్ చేసుకునే సదుపాయాన్ని యూజర్లందరికీ అందించింది. ఈ ఫీచర్‌తో అక్షరదోషాలను సరి చేసుకోవచ్చు. లేదా పోస్ట్‌లను డిలీట్ చేసి, మళ్లీ పోస్ట్ చేయకుండా వాటిని చిటికెలో అప్‌డేట్ చేసుకోవచ్చు. థ్రెడ్స్‌ మొబైల్ , వెబ్ వెర్షన్లలో ఎడిట్ బటన్ ఫీచర్ అందుబాటులో ఉంది. థ్రెడ్స్‌ ప్లాట్‌ఫామ్‌లో వాయిస్ నోట్స్‌ను షేర్ చేసుకునే ఆప్షన్ వల్ల యూజర్ ఎక్స్‌పీరియన్స్ మరింత మెరుగుపడుతుంది. యూజర్లు మైక్రోఫోన్ బటన్‌ను నొక్కి, వాయిస్‌ని రికార్డ్ చేసి దాన్ని పోస్ట్‌గా షేర్ చేయవచ్చు. ఈ ఫీచర్ థ్రెడ్స్‌ను మరింత ఇంటరాక్టివ్‌గా, టెక్స్ట్ కంటే ఆడియోను ఇష్టపడే యూజర్లకు ఆకర్షణీయంగా మారుస్తుంది. థ్రెడ్స్‌లో పోస్ట్‌ను ఎడిట్ చేసినప్పుడు పోస్ట్ చేసిన సమయానికి పక్కన ఒక చిన్న ఐకాన్ కనిపిస్తుంది. పోస్ట్‌లో ఏదో మార్చినట్లు ఈ ఐకాన్ చూపుతుంది. కానీ ఏం మార్చారో లేదా ఒరిజినల్ పోస్ట్ ఏంటో ఇతరులు చూడలేరు. పోస్ట్‌లో ఏం ఎడిట్ చేశారో యూజర్‌కు మాత్రమే తెలుస్తుంది. పోస్ట్‌లో చేసిన మార్పులను చూసేందుకు X వేరే ఫీచర్‌ని ఆఫర్ చేస్తోంది కానీ థ్రెడ్స్‌కు ఈ ఫీచర్ లేదు, దీన్ని జోడించడానికి మెటా ప్లాన్ కూడా చేయలేదని తెలుస్తోంది. లాంచ్ అయిన సమయం నుంచి థ్రెడ్స్‌లో క్రనాలజికల్ ఫాలోయింగ్ ఫీడ్, వెబ్ క్లయింట్, సెర్చ్ ఫంక్షన్ వంటి ఉపయోగకరమైన కొత్త ఫీచర్లను క్రమం తప్పకుండా జోడిస్తున్నారు. నివేదికల ప్రకారం, ప్లాట్‌ఫామ్‌లో యూజర్లకు మోస్ట్ పాపులర్ టాపిక్స్, హ్యాష్‌ట్యాగ్స్‌ను చూపే ట్రెండ్స్ ఫీచర్‌పై కూడా థ్రెడ్స్‌ యాప్ డెవలపర్లు పనిచేస్తున్నారు. ఈ ఫీచర్‌తో థ్రెడ్స్‌ ఎక్స్‌కి బలమైన పోటీని ఇచ్చే అవకాశం ఉంది. ఒక మెటా ఉద్యోగి థ్రెడ్స్‌లో ట్రెండ్స్ ఫీచర్ స్క్రీన్‌షాట్‌లను పోస్ట్ చేయగా, వీటిని యాప్ డెవలపర్ కనుగొన్నారు. థ్రెడ్స్‌ ప్లాట్‌ఫామ్‌లో ఫాలోవర్స్‌తో 280 అక్షరాల వరకు చిన్న పోస్ట్‌లను షేర్ చేసుకోవచ్చు. యూజర్లు ఇతరుల పోస్ట్‌లను లైక్ చేయవచ్చు, కామెంట్ చేయవచ్చు, రీపోస్ట్ చేయవచ్చు. థ్రెడ్స్‌ ఎక్స్ మాదిరిగానే ఉంటుంది, అయితే ఫ్రీ ఎడిట్ బటన్, వాయిస్ నోట్స్‌ వంటి కొన్ని ప్రత్యేక ఫీచర్లు కలిగి ఉన్నాయి. థ్రెడ్స్‌ యూజర్లు స్వేచ్ఛగా ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేసుకోవడానికి ఒక వేదిక అయింది, అలానే కామన్ ఇంట్రెస్ట్స్‌ పంచుకునే వారిని కనెక్ట్ చేయాలనే లక్ష్యంతో లాంచ్ అయింది.

Post a Comment

0 Comments

Close Menu