Ad Code

ఫ్లిప్ కార్ట్ 'బిగ్ దసరా సేల్స్'


ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ పేరిట సేల్స్ నిర్వహించింది. తాజాగా దసరా పండుగ నేపథ్యంలో 'బిగ్ దసరా సేల్' పేరుతో సేల్ నిర్వహిస్తున్నది. ఈ నెల 22 నుంచి 29 వరకూ అంటే.. ఎనిమిది రోజుల పాటు దసరా సేల్స్ జరుగనున్నాయి. ఫ్లప్ కార్ట్ ప్లస్ మెంబర్లకు ఒకరోజు ముందు నుంచే దసరా సేల్ అందుబాటులోకి వస్తుంది. బిగ్ దసరా సేల్'లో భాగంగా కోటక్ మహీంద్రా బ్యాంక్, ఆర్బీఎల్, ఎస్బీఐ కార్డు హోల్డర్లపై పది శాతం డిస్కౌంట్ అందిస్తున్నది. సూపర్ కాయిన్ల ద్వారా ఐదు శాతం అదనపు డిస్కౌంట్ అందుకోవచ్చునని ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది. ఇక దీపావళి పండుగకు ముందు మరో బిగ్ బిలియన్ డేస్ సేల్స్ అందుబాటులోకి తేనున్నది. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, హోం అప్లియెన్సెస్, దుస్తులపై ఆఫర్లు అందచేస్తున్నట్లు ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ఇప్పటికే మోటరోలా ఎడ్జ్ 40, ఒప్పో రెనో 10 5జీ, గూగుల్ పిక్సెల్ 7ఏ, శాంసంగ్ ఎస్ 22 5జీ, పోపో ఎఫ్5, వివో టీ2 ప్రో తదితర మొబైల్ ఫోన్లపై ఆఫర్లు అందిస్తున్నట్లు తెలిపింది. ఐ-ఫోన్ 14తోపాటు పలు స్మార్ట్ ఫోన్లపై త్వరలో ఆఫర్లు ప్రకటించనున్నది. ఇంతకు ముందు బిగ్ బిలియన్ డేస్ సేల్స్‌లో ఆఫర్ మిస్ అయిన వారు ఈ సేల్‌లో బెనిఫిట్ పొందొచ్చు. మోటరోలా ఎడ్జ్ 40 ఫోన్ రూ.34,999 నుంచి రూ.26,999లకు తగ్గింపు. రియల్ మీ 11 ప్రో+ 5జీ ఫోన్ రూ.32,999 నుంచి రూ.29,999లకు తగ్గింపు. ఒప్పో రెనో10 5జీ ఫోన్ రూ.38,999 నుంచి రూ.32,999లకు కుదింపు. గూగుల్ పిక్సెల్ 7ఏ ఫోన్ రూ.43,999 నుంచి రూ.35,999లకే లభ్యం. శాంసంగ్ గెలాక్సీ ఎస్22 ఫోన్ రూ.85,999 నుంచి రూ.39,999లకు తగ్గింపు. పొకో ఎఫ్5 5జీ ఫోన్ రూ.34,999 నుంచి రూ.23,999లకు కుదింపు. వివో టీ2 ప్రో 5జీ ఫోన్ రూ.3000 డిస్కౌంట్‌తో రూ.24,999లకు లభ్యం. నథింగ్ ఫోన్ 2 ఫోన్ రూ.59,999 నుంచి రూ.49,999లకు తగ్గింపు. మోటో జీ54 ఫోన్ రూ.17,999 నుంచి రూ.13,999లకు లభ్యం. ఐ-ఫోన్ 12 (64 జీబీ) ఫోన్ రూ.49,900 నుంచి రూ.42,999లకు తగ్గింపు. ఐసీఐసీఐ బ్యాంక్ డిస్కౌంట్‌తో రూ.39,999లకే లభ్యం. ఐ-ఫోన్ 13 (128 జీబీ) మోడల్ రూ.59,900 నుంచి రూ.51,999లకు లభ్యం. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు డిస్కౌంట్ తో రూ.49,399లకు తగ్గింపు. ఐ-ఫోన్ 14 (128 జీబీ) ఫోన్ రూ.69,900 నుంచి రూ.61,999లకు తగ్గింపు. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు డిస్కౌంట్ తో రూ.53,998లకు లభ్యం. ఐఫోన్ 15 (128 జీబీ) ఫోన్ ఐసీఐసీఐ బ్యాంక్ డిస్కౌంట్ తో రూ.78,150లకు లభ్యం.

Post a Comment

0 Comments

Close Menu