Ad Code

వాట్సాప్‌ మోసాలు - జాగ్రత్తలు !


వాట్సాప్ లో తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్లను లిఫ్ట్ చేసేటప్పుడు వినియోగదారులు మరింత జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు ఎత్తకుండా ఉండటం మంచిది. మీకు సంబంధించి వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని పంచుకునే ముందు కాల్ చేసింది ఎవరో నిర్థారించుకోండి. లేకపోతే మీ సమాచారం స్కామర్ల చేతిలో పడి దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. స్కామర్లు తరచుగా సమాచారాన్ని త్వరగా అందించమని ఫోర్స్ చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. వారు తమ మాటలతో మీలో కంగారు పుట్టిస్తారు. తెలియని నంబర్ల నుంచి వచ్చిన లింక్లపై క్లిక్ చేయడం మానుకోండి. ఎందుకంటే అవి మోసపూరిత వెబ్సైట్లు కావచ్చు. దాని కారణంగా మీ డేటా దుర్వినియోగం అవుతుంది. వాట్సాప్లో 2FAని యాక్టివేట్ చేయడం ద్వారా, మీరు అదనపు భద్రతను పొందవచ్చు. దీని ద్వారా స్కామర్లు మీ ఖాతాను యాక్సెస్ చేయడం కష్టతరం అవుతుంది. వారితో వెంటనే సంభాషణను ముగించండి. కాల్లో ఉంటే కట్ చేయండి లేదా మెసేజ్లకు రిప్లై ఇవ్వకుండా ఆపేయండి. మనీ ట్రాన్స్ఫర్ వంటి రిక్వెస్ట్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదు. స్కామర్లు మిమ్మల్ని సంప్రదించకుండా నిరోధించడానికి, వారిని బ్లాక్ చేసి, వాట్సాప్కి రిపోర్ట్ చేయండి.


Post a Comment

0 Comments

Close Menu