Ad Code

చాట్‌జీపీటీ క్రియేట్ చేసిన సాంగ్‌తో దుమ్మురేపిన బెంగళూర్ మ్యూజిక్ బ్యాండ్‌ !


రివల్యూషనరీ ఏఐ టూల్ చాట్‌జీపీటీ పలు రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నది. టెక్ట్స్ జనరేట్ చేయడం నుంచి, ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం వరకూ ఎన్నో సమస్యలను ఇట్టే పరిష్కరిస్తోంది. ఏఐ చాట్‌బాట్ ఇప్పుడు సరికొత్త సేవలకూ వేదికవుతోంది. ఏఐ కాన్ఫరెన్స్‌లో చాట్‌జీపీటీ క్రియేట్ చేసిన సాంగ్‌ను బెంగళూర్‌కు చెందిన మ్యూజిక్ బ్యాండ్ పెర్ఫామ్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. అవసరమైన వారికి చాట్‌జీపీటీ పాటలు రాస్తుండగా ఈవెంట్స్‌లో బ్యాండ్స్ ఆ సాంగ్స్‌ను పెర్ఫామ్ చేస్తున్నాయి. లేటెస్ట్ వైరల్ క్లిప్‌లో బెంగళూర్‌కు చెందిన ఫోక్ ఫ్యూజన్ సెన్సేషన్ స్వరాత్మ చాట్‌జీపీటీ సాంగ్‌ను సైఫర్ 2023 ఈవెంట్‌లో అద్భుతంగా రక్తికట్టించింది. ఈ సాంగ్‌ను పెర్ఫామ్ చేయడంతో పాటు బ్యాక్‌గ్రౌండ్‌లో చాట్‌జీపీటీని డిస్‌ప్లే చేశారు.

Post a Comment

0 Comments

Close Menu