Ad Code

వాట్సాప్ యూజర్లకు ఫేస్,ఫింగర్‌ప్రింట్స్‌తో లాగిన్ అయ్యే అవకాశం !


ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కొలీగ్స్ ఇలా తెలిసిన ప్రతి ఒక్కరితో కమ్యూనికేట్ అవ్వడాన్ని వాట్సాప్ సులభతరం చేసింది. అయితే ఫోన్‌ మార్చినప్పుడు లేదా యాప్‌ని డిలీట్ చేసి మళ్ళీ ఇన్‌స్టాల్ చేసినప్పుడు వాట్సాప్ అకౌంట్‌కు మళ్లీ లాగిన్ చేయాల్సి రావచ్చు. అలా చేయడానికి, సాధారణంగా ఫోన్ నంబర్, SMS ద్వారా వాట్సాప్ పంపే వన్-టైమ్ పాస్‌వర్డ్  కోడ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్‌ట్రా సెక్యూరిటీ కోసం ఆరు అంకెల పిన్‌/ టూ-ఫాక్టర్ అథెంటికేషన్ ని కూడా సెటప్ చేసుకోవాల్సి వస్తోంది. అయితే ఇప్పుడు ఆండ్రాయిడ్ వాట్సాప్ యూజర్లు అకౌంట్‌కు లాగిన్ కావడానికి, చాట్స్ సెక్యూర్ చేసుకోవడానికి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రస్తుతం వాట్సాప్ పాస్‌కీ అనే ఓ సింపుల్ లాగిన్ మెథడ్‌కు సపోర్ట్‌ను జోడించడం మొదలు పెట్టింది. పాస్‌కీ అనేది పాస్‌వర్డ్ లాంటిది, కానీ అది వాట్సాప్ సర్వర్‌కు బదులుగా యూజర్ ఫోన్‌లో స్టోర్ అవుతుంది. పాస్‌కీని అన్‌లాక్ చేయడానికి ఫోన్ ఫింగర్‌ప్రింట్ లేదా ఫేస్ స్కానర్ లేదా ఫోన్ పిన్‌ని ఉపయోగించవచ్చు. ఈ విధంగా ఎలాంటి కోడ్ లేదా పాస్‌వర్డ్ ఎంటర్ చేయకుండా ఏదీ గుర్తుంచుకోవాల్సిన లేదా టైప్ చేయాల్సిన అవసరం లేకుండా లాగిన్ కావచ్చు. ఫింగర్‌ప్రింట్ లేదా ఫేస్ స్కానింగ్ లేదా PINని ఎంటర్ చేసి వేగంగా, సురక్షితంగా అకౌంట్ లాగిన్ ప్రాసెస్ కంప్లీట్ చేయవచ్చు. ఓటీపీ, పిన్‌ల కంటే పాస్‌కీస్‌యే ఎక్కువ సురక్షితమైనవని వాట్సాప్ చెబుతోంది. పబ్లిక్ కీ క్రిప్టోగ్రఫీ అనే ప్రత్యేక టెక్నాలజీని ఉపయోగించి పాస్‌కీస్‌ ఎన్‌క్రిప్ట్ అవుతాయి. యూజర్, యూజర్ ఫోన్ మాత్రమే పాస్‌కీని యాక్సెస్ చేయగలవని దీనర్థం. అంతేకాదు, ఎవరైనా వాట్సాప్ సర్వర్‌ను హ్యాక్ చేసినప్పటికీ, పాస్‌కీని పొందలేరు లేదా అకౌంట్‌కు లాగిన్ కాలేరు. https://twitter.com/WhatsApp/status/1713948410942804433?t=F4HIlOshgBrVIEXeaWLQMg&s=19 పాస్‌కీస్‌ ప్రత్యేకంగా వాట్సాప్ తీసుకొచ్చిన కొత్త టెక్నాలజీ కాదు. అలాగే దీన్ని పరిచయం చేసిన తొలి యాప్ కూడా కాదు. గూగుల్, మరికొన్ని కంపెనీలు కొంతకాలంగా వాటిని ఉపయోగిస్తున్నాయి. పాస్‌కీ ఫాస్ట్ ఐడెంటిటీ ఆన్‌లైన్ (FIDO) అనే ప్రమాణంలో భాగంగా ఉంది. FIDO పాస్‌వర్డ్‌లను పాస్‌కీస్‌తో భర్తీ చేయడం, ఇంటర్నెట్‌ను సురక్షితంగా, ఉపయోగించడానికి సులభమైనదిగా చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌ > అకౌంట్ > పాస్‌కీస్‌> క్రియేట్ పాస్‌కీ  ఓపెన్ చేయాలి. పాస్‌కీస్ ఎలా పని చేస్తాయో వివరించే మెసేజ్ రీడ్ చేసి కంటిన్యూ పై క్లిక్ చేయాలి. వాట్సాప్ కోసం పాస్‌కీని సృష్టించాలనుకుంటున్నారా అని గూగుల్ పాస్‌వర్డ్ మేనేజర్ నుంచి మరొక మెసేజ్ అడుగుతుంది. కంటిన్యూపై నొక్కి, స్క్రీన్ లాక్ ఉపయోగించాలి. ఇప్పుడు వాట్సాప్ క్రియేట్ చేసిన పాస్‌కీని చూడవచ్చు. ఈ ఫీచర్ ఇంకా అందుబాటులోకి రానివారు మరికొద్ది వారాలు వేచి ఉండాలి. అప్‌కమింగ్ వీక్స్‌లో కొత్త లాగిన్ మెథడ్ అందరికీ అందుబాటులోకి రానుంది.

Post a Comment

0 Comments

Close Menu