Ad Code

ఐఫోన్లను తయారుచేయనున్న టాటా సంస్థ !


పిల్‌ సంస్థ ఐఫోన్లను భారత్‌లో తొలిసారిగా భారతీయ సంస్థ తయారు చేయనుంది. ఇప్పటి వరకు భారత్‌లో ఐఫోన్లను తయారీచేసిన విస్ట్రాన్‌ యూనిట్‌ను టాటా సంస్థ కొనుగోలు చేసింది. ఫలితంగా టాటా సంస్థ ఐఫోన్లను త్వరలో తయారు చేయనుంది. తెవాన్‌కు చెందిన విస్ట్రాన్‌ సంస్థ.. భారత్‌లో తన ఐఫోన్ల తయారీ ఫ్లాంట్‌ ను సుమారు రూ.1040 కోట్లకు టాటా సంస్థకు విక్రయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో టాటా ఎలక్ట్రానిక్స్‌ సంస్థ ఐఫోన్ల తయారీ చేయనున్నట్లు తొలి భారతీయ సంస్థగా నిలవనుంది. ఐఫోన్ల తయారీ ప్లాంట్‌ విక్రయ ఒప్పందాన్ని నిన్న నిర్వహించిన బోర్డు మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ శాఖ సహాయ మంత్రి ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా ధ్రువీకరించారు. ప్రధాన మంత్రి మోడీ PLI పథకం కింద టాటా గ్రూప్‌ వచ్చే రెండున్నర సంవత్సరాల్లో భారత్‌లో ఐఫోన్ల తయారీని ప్రారంభించనుంది. టాటా తయారీచేసిన ఐఫోన్లు భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉండనున్నాయని వెల్లడించారు. దీంతోపాటు ఓ పత్రికా ప్రకటనను కూడా పంచుకున్నారు. టాటా ఎలక్ట్రానిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వాటా కొనుగోలు ఒప్పందంపై సంతకం చేసేందుకు విస్ట్రాన్‌ సంస్థ తన అనుబంధ సంస్థలు SMS ఇన్ఫోకామ్‌ (సింగపూర్‌), విస్ట్రాన్‌ కాంగ్‌ లిమిటెడ్‌లకు అనుమతి మంజూరుచేసినట్లు ఈ ప్రకటనలో ఉంది. ఈ రెండు సంస్థల అంగీకారం తర్వాత టాటా, విస్ట్రాన్‌ సంస్థల మధ్య ఒప్పందం తర్వాత దశకు వెళ్తుందని తెలుస్తోంది. ఐఫోన్‌ల తయారీ సంస్థ విస్ట్రాన్‌ ప్లాంట్‌ ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు సమీపంలో ఉంది. సుమారు 150 సంవత్సరాల చరిత్ర కలిగిన టాటా గ్రూపు అనేక రంగాలకు విస్తరించి ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఎలక్ట్రానిక్స్‌ తయారీ వైపు అడుగులు వేస్తోంది. టాటా సంస్థకు తమిళనాడు రాష్ట్రంలో వందల ఎకరాల్లో అతిపెద్ద ఫ్యాక్టరి ఉంది. ఇందులో ఐఫోన్‌ ఛాసిస్‌ను తయారు చేస్తోంది. దీంతోపాటు చిప్‌ తయారీలోనూ గుర్తింపు తెచ్చుకుంది. సెప్టెంబర్‌ 12న నిర్వహించిన వండర్‌లస్ట్‌ ఈవెంట్‌లో ఆపిల్ సంస్థ ఐఫోన్‌ 15 సిరీస్‌ను విడుదల చేసింది. భారత్‌ మార్కెట్‌లో ఐఫోన్‌ 15 బేస్‌ మోడల్‌ రూ.79,900, అలాగే ఐఫోన్ 15 ప్లస్‌ ప్రారంభ ధర రూ.89,900గా ఉంది. ఈ రెండు ఫోన్లు 128GB, 256GB, 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ రెండు ఫోన్లు నలుపు, నీలం, ఆకుపచ్చ, పింక్‌, పసుపు రంగుల్లో లభిస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu