Ad Code

వాట్సాప్‌ లో 'సీక్రెట్ కోడ్' ఫీచర్ ?


వాట్సాప్ డెవలపర్లు "సీక్రెట్ కోడ్" అనే మరో కొత్త ఫీచర్‌పై పని చేస్తున్నారు. ఈ ఫీచర్‌తో యూజర్లు లాక్డ్‌ చాట్‌ల కోసం పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోవచ్చు. సీక్రెట్ కోడ్ ఫీచర్, చాట్స్‌ను లాక్ & హైడ్ చేసుకునే ప్రస్తుత ఫీచర్‌కు ఎక్స్‌ట్రా సెక్యూరిటీ లేయర్ అప్‌డేట్‌గా అందుబాటులోకి రానుంది. ఇది ఇంకా అభివృద్ధి దశలో ఉండగా, త్వరలో బీటా టెస్టర్లకు విడుదల అవుతుందని వాట్సాప్ బీటా ఇన్ఫో  లేటెస్ట్ రిపోర్ట్ వెల్లడించింది. యూజర్లు చాట్ సెట్టింగ్స్‌లో లాక్డ్‌ చాట్స్ కోసం సీక్రెట్ కోడ్‌ను సెటప్ చేసుకోవచ్చు. సీక్రెట్ కోడ్‌ను సెట్ చేశాక, యూజర్లు లాక్డ్‌ చాట్‌లను ఓపెన్ చేయడానికి మళ్లీ సీక్రెట్ కోడ్ ఎంటర్ చేయాలి. ఇతరులు ఫోన్‌ని తీసుకున్నప్పుడు, సున్నితమైన, పర్సనల్ చాట్స్ చూడకుండా చేయడానికి ఈ ఫీచర్ ఉపయోగిస్తే సరిపోతుంది. ఈ స్పెసిఫికేషన్‌తో అత్యంత ప్రైవేట్ చాట్‌ల కోసం పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోవచ్చు, తద్వారా వారు మాత్రమే వాటిని ఓపెన్ చేయగలిగేలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సీక్రెట్ కోడ్ అనేది యూజర్లు ఎంచుకునే వర్డ్ లేదా ఎమోజీ. లాక్డ్‌ చాట్స్‌ను త్వరగా కనుగొనడానికి వాట్సాప్ సెర్చ్ బార్‌లోని సీక్రెట్ కోడ్‌ను టైప్ చేయవచ్చు. దీనితో కంప్యూటర్ లేదా ట్యాబ్లెట్ వంటి లింక్డ్‌ డివైజ్‌ల్లోనూ లాక్డ్‌ చాట్స్‌ను యాక్సెస్ చేయవచ్చు. వాట్సాప్ కంపేనియన్ డివైజ్‌లతో కూడా చాట్ లాక్‌ని ఇంటిగ్రేట్ చేసే పనిలో ఉంది. వాట్సాప్ ఇప్పటికే ఫింగర్‌ప్రింట్ యాప్ లాక్, ఫేస్ అన్‌లాక్ లేదా పిన్ కోడ్ వంటి సెక్యూరిటీ ఫీచర్లను ఆఫర్ చేస్తోంది. కొత్త సీక్రెట్ కోడ్ ఫీచర్ చాట్స్‌ను మరింత సురక్షితంగా, సులభంగా కనుగొనేలా చేస్తుంది. సీక్రెట్ కోడ్ యాప్ సెర్చ్ బార్‌ లో ఎంటర్ చేసి, లాక్డ్ చాట్స్ ఈజీగా కనిపెట్టవచ్చు. వాట్సాప్ చాట్ లాకింగ్ ఫీచర్‌ను మెయిన్ చాట్ లిస్ట్‌ నుంచి నిర్దిష్ట చాట్స్‌ను హైడ్ చేసుకొని, ప్రొటెక్ట్ చేసుకోవడానికి యూజర్లు ఉపయోగించవచ్చు. ఈ ఫీచర్ ఎనేబుల్ చేయడానికి లాక్ చేయాలనుకుంటున్న చాట్‌ని ఓపెన్ చేయాలి. చాట్ ఇన్ఫో బటన్‌ను నొక్కాలి. క్రిందికి స్క్రోల్ చేసి, "చాట్ లాక్" ఆప్షన్‌పై నొక్కాలి. టోగుల్ ఆన్ చేయాలి. లాక్డ్‌ చాట్‌లు చాట్ లిస్ట్‌ ఎగువన ఉన్న స్పెషల్ ఫోల్డర్‌కి మూవ్ అవుతాయి. సెక్యూరిటీ లాక్‌ని ఎంటర్ చేయడం ద్వారా మాత్రమే ఈ ఫోల్డర్‌ని యాక్సెస్ చేయడం కుదురుతుంది.

Post a Comment

0 Comments

Close Menu