ఒకప్పుడు ఇయర్ ఫోన్స్ అంటే వైర్‌తో కూడిన హెడ్‌సెట్టే. కానీ, ఇప్పుడు వాటి స్థానంలో వైర్‌లెస్ ఇయర్ ఫోన్స్ వచ్చి చేరాయి. ఇప్పుడు ఎవరి చెవిలో చూసినా సింపుల్‌గా ఇమిడిపోయే టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్సే దర్శనమిస్తున్నాయి. వెయ్యి రూపాయల నుంచి రూ.25వేల వరకు వివిధ కంపెనీల ఇయర్‌బడ్స్ ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్నాయి. మొబైల్ తయారీ కంపెనీలతో పాటు వేరెబుల్స్ తయారు చేసే కంపెనీలూ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్‌ను తీసుకొస్తున్నాయి. ఒకప్పుడు రూ.5వేలు పెడితే గానీ దొరకని ఇయర్‌బడ్స్ ఇప్పుడు వెయ్యి రూపాయల్లోపే దొరికేస్తున్నాయి. ఒకవేళ తక్కువ ధరకే దొరుకుతున్నాయని కొనేస్తే తర్వాత సౌండ్ క్వాలిటీ, కాల్స్ విషయంలో చింతించాల్సి ఉంటుంది. కాబట్టి ఇయర్‌ఫోన్స్ కొనేముందు ధరను మాత్రమే కాకుండా సౌండ్ క్వాలిటీ, బ్యాటరీ లైఫ్, కనెక్టివిటీ, నాయిస్ క్యాన్సిలేషన్ వంటివి పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు మ్యూజిక్ ప్రియులైతే.. వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ కొనేటప్పుడు ఆడియో క్వాలిటీ కావాలంటే కాస్త ఎక్కువ ధర పెట్టాల్సిందే. ప్రీమియం ఇయర్ బడ్స్‌లో మంచి క్వాలిటీ బ్లూటూత్ చిప్స్‌ను అమరుస్తారు. తక్కువ ధర ఇయర్‌బడ్స్‌లో నాసిరకం బ్లూటూత్ చిప్స్‌ను అమరుస్తారు. పైగా వీటిలో వాడే మైక్రోఫోన్ సైతం నాసిరకంగా ఉంటుంది. దీంతో మ్యూజిక్ వినడం, కాల్స్ మాట్లాడడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. మంచి క్వాలిటీ ఆడియో కావాలంటే వాటిల్లో aptX, aptX HD, LDAC, AAC వంటి కోడెక్స్‌ను (codecs) వినియోగించారో లేదో చూసుకోండి. ఇప్పుడు దాదాపు అన్ని ఇయర్‌ఫోన్లలో బ్లూటూత్ 5.0+ కనెక్టివిటీతో వస్తున్నాయి. 5.3 అనేది లేటెస్ట్ వెర్షన్. వీలైనంత వరకు లేటెస్ట్ వెర్షన్ బ్లూటూత్ ఉన్న ఇయర్ బడ్స్‌ను ఎంచుకోండి. అలాగే గేమర్లయితే తక్కువ లేటెన్స్ ఉండే ఇయర్‌బడ్స్‌ను వినియోగించుకోవాలి. అప్పుడే తక్కువ ల్యాగ్ ఉంటుంది. సాధారణంగా 100 మిల్లీసెకండ్స్‌తో వస్తుంటాయి. 50 మిల్లీ సెకండ్స్ అయితే బెటర్. ప్రీమియం ఇయర్ బడ్స్‌లో లేటెన్సీ 20 మిల్లీసెకండ్స్ కంటే తక్కువ ఉంటుంది. బ్లూటూత్ ఇయర్‌బడ్స్‌లో ఛార్జింగ్ ముఖ్యం. ఇందులో కేస్, ఇయర్‌బడ్స్.. వేర్వేరు బ్యాటరీలు కలిగి ఉంటాయి. కనీసం రెండూ కలిపి 35 గంటల కంటే ఎక్కువ ప్లే బ్యాకప్ ఉండే ఇయర్‌బడ్స్‌ను తీసుకోవడం మంచిది. సాధారణంగా కంపెనీలు చెప్పేదాని కంటే ఒకటి రెండు గంటలు బ్యాటరీ బ్యాకప్ తక్కువగానే వస్తాయనేది గుర్తు పెట్టుకోవాలి. TWS ఇయర్‌బడ్స్ కొనుగోలు చేసేటప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ అన్న పదం తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఇందులో ఒకటి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. రెండోది పాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్. దీన్నే ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ అని కూడా అంటారు. ఏఎన్‌ఎసీ అనేది అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ. బయటి నుంచి వచ్చే శబ్దాలను అల్గారిథమ్స్ ద్వారా, మైక్రోఫోన్ల ద్వారా అనలైజ్ చేసి.. యాంటీ నాయిస్ సౌండ్ వేవ్‌లను పంపించి బయటి శబ్దాలను అడ్డుకుంటుంది. దీనివల్ల మ్యూజిక్‌ను వినేటప్పుడు, కాల్స్ మాట్లాడేటప్పుడు బయటి శబ్దాలు వినిపించకుండా అడ్డుకుంటాయి. కనీసం 30 డెసిబుల్స్ వరకు శబ్దాలను అడ్డుకునే ఇయర్‌బడ్స్‌ను తీసుకోవడం మంచిది. ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది సాధారణంగా అన్ని ఇయర్‌బడ్స్‌లో ఉండేదే. బయటి శబ్దాలు చెవిలోకి చొరబడకుండా అడ్డుకోవచ్చు. అంటే ఇది పూర్తిగా డిజైన్‌పై ఆధారపడి ఉంటుంది. అయితే, ఇయర్ బడ్స్‌ను కొనేటప్పుడు యాక్టివ్, ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ రెండూ ఉండే హైబ్రిడ్ నాయిస్ క్యాన్సిలేషన్ కలిగిన ఇయర్‌బడ్స్‌ను తీసుకోవడం మంచిది.
వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ - జాగ్రత్తలు !
0
October 04, 2023
Tags