ఆండ్రాయిడ్ ఫోన్లలో సైడ్‌లోడెడ్ యాప్స్‌ను ఎలా హ్యాండిల్ చేయాలనే దానిపై గూగుల్ సొంత పాలసీ తీసుకొస్తోంది. సైడ్‌లోడెడ్ యాప్స్ అంటే అఫీషియల్ గూగుల్ ప్లే స్టోర్ కాకుండా ఇతర సోర్సెస్ నుంచి ఇన్‌స్టాల్ చేసిన యాప్స్. అంటే థర్డ్-పార్టీ యాప్ స్టోర్లు లేదా డౌన్‌లోడెడ్ APK ఫైల్స్ నుంచి ఇన్‌స్టాల్ చేసుకునేవి. ఆండ్రాయిడ్ యూజర్లకు యాప్‌లను సైడ్‌లోడ్ చేసే పూర్తి స్వేచ్ఛ ఉంది, అయితే మాల్వేర్ లేదా సెక్యూరిటీ బ్రీచెస్ ప్రమాదాల గురించి గూగుల్ ఎల్లప్పుడూ హెచ్చరిస్తుంది. ఇప్పుడు సైడ్‌లోడెడ్ యాప్‌లను స్కాన్ చేయడానికి, పర్యవేక్షించడానికి, అవి సురక్షితంగా ఉన్నాయో లేదో వినియోగదారులకు తెలియజేయడానికి గూగుల్ ప్లే ప్రొటెక్ట్ ఫీచర్‌ను ఉపయోగించాలని యోచిస్తోంది. ప్లే ప్రొటెక్ట్ అనేది బిల్ట్-ఇన్ సెక్యూరిటీ సర్వీస్. ఇది ఏదైనా హానికరమైన వైరస్ లేదా యాక్టివిటీని కనిపెట్టడానికి ప్లే స్టోర్‌తో సహా డివైజ్‌లోని యాప్‌లను స్కాన్ చేస్తుంది. గూగుల్ సంస్థ డేటా అనాలసిస్, కోడ్-లెవెల్ స్క్రీనింగ్‌తో సైడ్‌లోడెడ్ యాప్‌లలో హానికరమైన కోడ్ ఉందా లేదా అనేది గుర్తించనుంది. ఈ కొత్త చర్య మొదటగా భారతదేశంలో ప్రారంభమవుతుంది. అందుకు కారణం ఇండియాలో చాలా మంది ఆండ్రాయిడ్ వినియోగదారులు ప్రత్యామ్నాయ యాప్ స్టోర్‌లపై ఆధారపడతారు లేదా ఇంటర్నెట్ నుంచి నేరుగా యాప్‌లను డౌన్‌లోడ్ చేస్తారు. సైడ్‌లోడెడ్ యాప్‌లను స్కాన్ చేయడం ద్వారా, మాల్వేర్ వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చని, యూజర్ల ప్రైవసీ, డేటాను రక్షించవచ్చని గూగుల్ భావిస్తోంది. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నంత వరకు, ఎలాంటి సోర్స్ నుంచి అయినా యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని కూడా గూగుల్ నిర్ధారించాలనుకుంటోంది. సైడ్‌లోడెడ్ యాప్‌లపై గూగుల్ గతంలో వేరే వైఖరి కలిగి ఉండేది. కేవలం వినియోగదారులను హెచ్చరించడం, అన్ని చర్యలకు మీరే బాధ్యులు అన్నట్లు ప్రవర్తించడం చేసేది. సైడ్‌లోడెడ్ యాప్‌లు గూగుల్ పాలసీలను ఉల్లంఘించినా లేదా హానికరమైన కోడ్‌ను కలిగి ఉన్నప్పటికీ, గూగుల్ వాటిని స్కాన్ లేదా బ్లాక్ చేయకపోయేది. వివిధ యాప్ స్టోర్‌ల నుంచి యాప్‌లను ఇన్‌స్టాల్ చేసే వినియోగదారులకు వార్నింగ్ మాత్రమే ఇస్తామని, వాటిని ఆపడం లేదా స్కాన్ చేయమని గూగుల్ ఈ ఏడాది ప్రారంభంలో పేర్కొంది. అయితే సైడ్‌లోడెడ్ యాప్‌లపై గూగుల్ తాజా పాలసీ, ఆండ్రాయిడ్ యూజర్లను రక్షించడమే కాక విభిన్న యాప్ సోర్స్‌లలో సేఫ్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందించనుందని చెప్పుకోవచ్చు.
థర్డ్ పార్టీ యాప్స్ పై గూగుల్ సొంత పాలసీ ?
0
October 20, 2023
Tags