Ad Code

అందరూ డబ్బు చెల్లించాల్సిందే !


లాన్ మస్క్ గతేడాది అక్టోబర్ నెలలో సోషల్ మీడియా కంపెనీ X (గతంలో ట్విట్టర్)ను కొనుగోలు చేశారు. అప్పటినుంచి కొత్త పేరు, లోగోతో సహా చాలా మార్పులు తీసుకొచ్చారు. ఆదాయాన్ని పెంచుకునేందుకు వెరిఫికేషన్ బ్యాడ్జ్‌ను పెయిడ్ ఫీచర్‌గా మార్చేశారు. అయితే బ్లూటిక్ మార్క్ పొందాలని ఉన్నా, కొందరు సబ్‌స్క్రిప్షన్ తీసుకోలేకపోతున్నారు. వారికోసం ప్రస్తుతం ఎక్స్ కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను పరీక్షిస్తోంది. మన దేశంలో ఎక్స్‌ ప్రీమియం  తీసుకోవాలంటే నెలకు రూ.900 చెల్లించాలి. అయితే ఈ సింగిల్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను మూడు అంచెలుగా విభజించాలని ఎక్స్ ప్లాన్ చేస్తోంది. ఈ విషయాన్ని ట్విట్టర్ సీఈవో లిండా యాకారినో వెల్లడించారు. వాటిలో బేసిక్, స్టాండర్డ్, ప్రీమియం ప్లస్ ఉంటాయని సమాచారం. ప్రస్తుత ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ పూర్తి ధరను చెల్లించడానికి ఇష్టపడని యూజర్ల నుంచి మరింత ఆదాయాన్ని పొందాలని X భావిస్తోందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. అందులో భాగంగా కొత్తగా మూడు ప్రీమియం టైర్స్ తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఆరోన్ అనే రీసెర్చర్ రీసెంట్‌గా X యాప్ కోడ్‌ను విశ్లేషించి కొత్త ప్లాన్స్ కనుగొన్నట్లు @ఆరోన్614 (@Aaronp613) అనే ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ఎక్స్ బేసిక్ ప్రీమియం తీసుకున్న యూజర్లు ఫుల్‌గా ప్రకటనలను చూస్తారని, స్టాండర్డ్ యూజర్లు హాఫ్ యాడ్స్ చూస్తారని, ప్రీమియం ప్లస్ యూజర్లు ఎలాంటి యాడ్స్ చూడరని యాప్ కోడ్ విశ్లేషణలో తెలుసుకున్నట్లు తెలిపారు. యాడ్స్ వచ్చినా పర్లేదు అనుకున్న వారు బేసిక్ వెర్షన్ తీసుకొని బెనిఫిట్స్ పొందవచ్చు. సీఈవో లిండా యాకారినో డెట్ హోల్డర్‌లతో జరిగిన సమావేశంలో ఈ సబ్‌స్క్రిప్షన్ టైర్స్‌ వస్తున్నట్లు పేర్కొన్నారు. కానీ X ఇంకా ఈ కొత్త సబ్‌స్క్రిప్షన్ టైర్స్‌ను అధికారికంగా ప్రకటించలేదు. కాబట్టి ఇవి అందుబాటులోకి వస్తాయా లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే వీటి ధరలు ఎంత నిర్ణయిస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. కొద్ది రోజుల క్రితం మస్క్ ఎక్స్ యాప్‌ని ఉపయోగించడానికి వినియోగదారుల నుంచి కొంత మొత్తంలో డబ్బు వసూలు చేయడం గురించి ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ప్లాట్‌ఫామ్‌లో బాట్‌ల సమస్యను ఎదుర్కోవడానికి ఇదొక్కటే మార్గమని అభిప్రాయపడ్డారు. సాధారణంగా స్పామ్, తప్పుడు సమాచారం, దుష్ప్రచారాన్ని వ్యాప్తి చేయడానికి బాట్స్‌ ఉపయోగిస్తుంటారు. యాప్ యూజ్‌ చేసినందుకే ఫీజు వసూలు చేస్తామని మస్క్ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి. ఈ ఫీజు ఎంతో మస్క్ చెప్పలేదు, కానీ అది చిన్న మొత్తంగానే ఉండవచ్చు. ఫీజును ఎప్పుడు ప్రవేశపెడతారనే దానిపై కూడా స్పష్టత లేదు. ఈ ఛార్జీ విధించాలా వద్దా అనే దాని గురించి మస్క్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. దీనివల్ల తలెత్తే ప్రతికూల ప్రభావాలను అంచనా వేసుకొని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Post a Comment

0 Comments

Close Menu