Ad Code

తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ గేమింగ్‌ ల్యాప్‌టాప్స్‌


సర్ కంపెనీకి చెందిన Acer Aspire 7 Core i5 ల్యాప్‌టాప్‌ అసలు ధర రూ. 78,999 కాగా 31 శాతం డిస్కౌంట్‌తో రూ. 53,990కి సొంతం చేసుకోవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌లో 15.6 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. ఐపీఎస్‌ టెక్నాలజీ ఈ స్క్రీన్‌ సొంతం. ఇందులోని ప్రాసెసర్‌ గేమింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 4 జీబీ గ్రాఫిక్‌ కార్డు, 16 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ ఈ ల్యాప్‌టాప్‌ సొంతం.

అసూస్‌ కంపెనీకి చెందిన ASUS Vivobook Pro 15 ల్యాప్ టాప్‌ అసలు ధర రూ. 49,990కాగా 34 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 49,990కి సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ ల్యాప్‌టాప్‌లో 15.6 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. గేమింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ను అందించే ఈ ల్యాప్‌టాప్‌లో 34 జీబీ డెడికేటెడ్‌ గ్రాఫిక్‌ కార్డును అందించారు. 8 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ ఈ ల్యాప్‌టాప్‌ సొంతం.

హెచ్‌పీ కంపెనీకి చెందిన HP Victus Core i5 12th Gen ల్యాప్‌టాప్‌ అసలు ధర రూ. 74,829 కాగా, 21 శాతం డిస్కౌంట్‌తో రూ. 58,990కి సొంతం చేసుకోవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌లో 15.6 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. సూపర్‌ గేమింగ్ కోసం ప్రత్యేక ఫీచర్‌ను అందించారు.

లెనెవో కంపెనీకి చెందిన Lenovo IdeaPad Gaming 3 ల్యాప్‌టాప్‌ అసలు ధర రూ. 73,490కాగా, 34 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 47,990కే సొంతం చేసుకోవచ్చు. గేమింగ్‌ 3 మోడల్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ ల్యాప్‌టాప్‌లో బ్యాటరీ బ్యాకప్‌ 8 గంటల వరకు ఇస్తుంది. ఇక ఇందులో 4జీబీ గ్రాఫిక్ కార్డును అందించారు. అలాగే ఈ ల్యాప్‌టాప్‌లో 8 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ను అందించారు.

రూ. 50 వేలలోపు అందుబాటులో ఉన్న బెస్ట్ ల్యాప్‌టాప్స్‌లో MSI GF63 Core i5 11th Gen 11260H బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. గేమింగ్‌కు పర్‌ఫెక్ట్‌గా నిలిచే ఈ ల్యాప్‌టాప్‌ అసలు ధర రూ. 70,990కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 47,990కి సొంతం చేసుకోవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌లో 15.6 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. కోర్‌ఐ5 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ల్యాప్‌టాప్‌లో 16జీబీ ర్యామ్‌, 512 జీబీ ఎస్‌ఎస్‌డీని ఇచ్చారు. 

Post a Comment

0 Comments

Close Menu