Ad Code

లక్ష రూపాయల సోనీ టీవీ ఆర్డర్ చేస్తే థామ్సన్ టీవీ వచ్చింది !

ర్యన్ అనే వ్యక్తి ఫ్లిప్‌కార్ట్ నుంచి లక్ష రూపాయల విలువైన సోనీ స్మార్ట్ టీవీని ఆర్డర్ చేశాడు. అయితే ఆ పెట్టె తెరిచి చూసేసరికి షాక్ తిన్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ 'నేను అక్టోబర్ 7న Flipkart నుండి Sony TVని ఆర్డర్ చేసా, టీవీ అక్టోబర్ 10న డెలివరీ చేయబడింది. అక్టోబర్ 11న సోనీకి చెందిన వ్యక్తి ఇన్‌స్టాలేషన్ కోసం వచ్చాడు. అతను స్వయంగా టీవీని అన్‌బాక్స్ చేసి చూస్తే సోనీ బాక్స్ నుండి థామ్సన్ టీవీ రావడం చూసి మేమంతా ఆశ్చర్యపోయాము. ఆది మాత్రమే కాదు ఆ బాక్స్ లో ఎలాంటి ఉపకరణాలు కూడా లేవు. అంటే స్టాండ్ - రిమోట్ లాంటివి లేవని చెప్పుకొచ్చారు. దీంతో ఆర్యన్ వెంటనే ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేశాడు. మీకు అందిన పార్శిల్ చిత్రాలను షేర్ చేయాలని ఫ్లిప్‌కార్ట్‌ని కోరింది. ఆ తర్వాత రిటర్న్ అభ్యర్థన ఇంకా ప్రాసెస్ కాలేదు, రిజల్యూషన్ వ్యవధి అక్టోబర్ 24 వరకు ఉంది, కానీ రిజల్యూషన్ మెసేజ్ 20వ తేదీనే వచ్చింది, ఆపై తేదీని నవంబర్ 1 వరకు పొడిగించారు. ఆ తర్వాత కూడా టీవీ తిరిగి రాలేదు. అక్టోబర్ 25న మళ్లీ రిసాల్వ్ అయినట్టు సందేశం వచ్చింది కానీ టీవీని మాత్రం మార్చలేదు. నిజానికి పాపం ఆర్యన్ ప్రపంచకప్‌ను చూసేందుకు ప్రత్యేకంగా టీవీని కొనుగోలు చేశాడు. కానీ ఈ టీవీ అతనికి ఒక పీడకలగా మారింది. 

Post a Comment

0 Comments

Close Menu