వాట్సాప్ ఛానల్స్‌లో మెసేజ్ రియాక్షన్ ఫిల్టర్ అనే మరో కొత్త ఆప్షన్‌ను టెస్ట్ చేస్తోంది. ఈ ఫీచర్‌తో ఛానల్ అడ్మిన్లు సొంత ఛానల్ పోస్ట్స్‌కు వచ్చిన కాంటాక్ట్స్‌ల రియాక్షన్లను ఫిల్టర్ చేసుకోవచ్చు. వాట్సాప్ ట్రాకర్ వాట్సాప్ బీటా ఇన్ఫో గూగుల్ ప్లే స్టోర్‌లోని ఆండ్రాయిడ్ వాట్సాప్ లేటెస్ట్ బీటా వెర్షన్ 2.23.23.3లో ఈ ఫీచర్‌ను గుర్తించింది. థంబ్స్ అప్, హార్ట్ లేదా ఎమోజీ వంటి ఛానల్ పోస్ట్‌లకు ప్రతి కాంటాక్ట్ ఎలా రియాక్ట్ అయ్యారో చూసేందుకు ఈ ఆప్షన్‌ను ఛానల్ అడ్మిన్లు ఉపయోగించవచ్చు. తద్వారా ఛానల్స్‌లో షేర్ చేసిన కంటెంట్ గురించి కాంటాక్ట్స్‌ల అభిప్రాయాన్ని అడ్మిన్స్ తెలుసుకోవచ్చు. వాట్సాప్ బీటా ఇన్ఫో ఈ కొత్త స్పెసిఫికేషన్‌కి సంబంధించిన ఒక స్క్రీన్‌షాట్ కూడా పంచుకుంది. ఆ స్క్రీన్‌షాట్‌లో ఛానల్ అప్‌డేట్‌కు వచ్చిన రియాక్షన్ల లిస్టును చూస్తున్నప్పుడు "కాంటాక్ట్స్" పేరుతో కొత్త ఫిల్టర్ కనిపించింది. దానిపై క్లిక్ చేయడం ద్వారా ఒక్కో కాంటాక్ట్ ఏయే ఎమోజీతో రియాక్ట్ అయిందో ఈజీగా తెలుసుకోవచ్చని స్క్రీన్‌షాట్ ప్రకారం తెలుస్తోంది. అలానే ఆడియన్స్ నుంచి కాంటాక్ట్స్ ఎమోజీలను సింపుల్‌గా ఫిల్టర్ చేసుకోవచ్చని అర్థమవుతోంది. కొత్త ఫీచర్‌తో ఆడియన్స్, కాంటాక్ట్స్‌కు ఎలాంటి కంటెంట్ బాగా నచ్చుతుందో ఛానల్ అడ్మిన్స్ అర్థం చేసుకోవడం సాధ్యమవుతుందని వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది. ఛానల్ స్ట్రాటజీని మెరుగుపరచడంలో ఈ ఫీచర్ కీలక పాత్ర పోషిస్తుందని కూడా వాట్సాప్ బీటా ఇన్ఫో అభిప్రాయపడింది. ఈ ఫీచర్‌తో కీలక అభిప్రాయాలను తెలుసుకుని భవిష్యత్తు పోస్ట్‌లను, ఎంగేజ్‌మెంట్‌ను తదనుగుణంగా అడ్జస్ట్ చేసుకోవచ్చని వెల్లడించింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ సరికొత్త వాట్సాప్ బీటాను ఇన్‌స్టాల్ చేసిన కొంతమంది బీటా టెస్టర్స్‌కు ఈ ఫీచర్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఇది మరికొద్ది రోజుల్లో మరింత మంది వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.
ఛానల్స్‌లో మెసేజ్ రియాక్షన్ ఫిల్టర్ ఆప్షన్ !
0
October 25, 2023
Tags