Ad Code

టాటా హారియర్ ఫీచర్లు !


టాటా మోటార్స్ ఇటీవల 2023 టాటా హారియర్ SUVని లాంచ్ చేసింది. కొత్త Tata Harrier SUV మిడ్-సైకిల్ ఫేస్‌లిఫ్ట్‌తో ఇంటీరియర్ ఇంకా ఎక్స్‌టీరియర్‌లో అప్డేటెడ్ మార్పులను చేశారు. 2023 టాటా హారియర్‌ డిజైన్‌ను గనుక మీరు పరిశీలిస్తే ఈ కార్ Curvv కాన్సెప్ట్‌ డిజైన్‌కు అప్‌డేట్‌ అయినట్లుగా కనిపిస్తుంది. ఇక పాత వెర్షన్‌తో పోలిస్తే ముందు, వెనుక భాగంలో ఈ కార్ కి చాలా మార్పులు చేశారు. అలాగే ఫ్రంట్ ఎండ్ మరింత నిటారుగా కనిపించడంతో పాటు బానెట్‌పై LED DRL రన్ అవుతుంది. ఈ కొత్త 2023 టాటా హారియర్‌లో 17, 18, 19 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఆప్షన్స్‌ ఉన్నాయి. ఇక వేరియంట్‌ను బట్టి వీల్స్‌ సైజ్‌ ఉంటాయి.ఇక ఈ కొత్త టాటా హారియర్‌ ఫేస్‌లిఫ్ట్‌ ఇంటీరియర్‌లో చాలా మార్పులు చేయడం జరిగింది. ఎక్స్‌టీరియర్‌ కలర్‌కు మ్యాచ్‌ అయ్యేలా కొత్త డ్యాష్ బోర్డ్‌, గ్రాబ్ హ్యాండిల్‌లు ఇంకా అలాగే సెంటర్ కన్సోల్ స్పోర్ట్‌ను అదే కలర్‌తో ఫినిషింగ్‌ చేశారు. దీనికి మల్టీ-లేయర్ డాష్ దాని మధ్యలో 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 10-స్పీకర్ JBL సరౌండ్ సౌండ్ సిస్టమ్‌తో జత చేయబడింది. వైర్‌లెస్ apple CarPlay ఇంకా Android auto కనెక్టివిటీని అందిస్తుంది.ఇంకా ఈ టాటా హారియర్‌ ఫేస్‌లిఫ్ట్‌లో సేఫ్టీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో పాత వెర్షన్ మాదిరిగానే ప్రత్యేక red డార్క్ ఎడిషన్‌లో 11 ఫీచర్లతో ADAS సిస్టమ్‌లను కలిగి ఉండటం మరో ప్రత్యేకత. ఇంకా మొత్తం 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ఆటో హెడ్‌ల్యాంప్‌లు, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు, ఎయిర్ ప్యూరిఫైయర్, ఫ్రంట్, రియర్ పార్కింగ్ సెన్సార్‌లు, 360-డిగ్రీ యాంగిల్‌ కెమెరా, ABS విత్ EBD ఇంకా ESP వంటి అప్డేటెడ్ ఫీచర్లు కూడా ఈ కార్ లో ఉన్నాయి. ఈ కార్ కూడా ఖచ్చితంగా సఫారీ కార్ లాగే ఫారెన్ కార్లకి గట్టి పోటీని ఇస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu