జీమెయిల్ యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్స్‌తోపాటు సెక్యూరిటీ పరంగా యూజర్లకు భరోసా ఉండటంతో ఎక్కువ మంది మెయిల్స్ పంపేందుకు ఉపయోగిస్తున్నారు. అయితే.. ఇటీవల కాలంలో ఇతర భాషల్లో కూడా మెయిల్ రావడం సర్వసాధారణమైపోయింది. ఇలా మనకు తెలియన భాషల్లో మెయిల్ రావడం వల్ల సైబర్ ఫ్రాడ్లకు గురై ఆర్థికంగా నష్టపోయిన సందర్భాలున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని జీమెయిల్ సరికొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇది ప్రస్తుతం మొబైల్లో జీమెయిల్ యాప్ ఉపయోగించే వారికి మాత్రమే అందుబాటులోకి వచ్చింది. జీమెయిల్ తీసుకొచ్చిన ఆ కొత్త ఫీచరే ట్రాన్స్‌లేట్ ఆప్షన్ ఫీచర్. ఈ సదుపాయం ఇప్పటికే వెబ్ జీమెయిల్ వెర్షన్లో అందుబాటులో ఉంది. ఇప్పుడు తీసుకొచ్చిన ఈ ఫీచర్‌ను ఐపోన్ యూజర్లతోపాటు ఆండ్రాయిడ్ యూజర్లూ వినియోగించుకోవచ్చు. దీని ద్వారా జీమెయిల్లోని భాషను ఇతర భాషల్లోకి ట్రాన్స్‌లేట్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తూ గూగుల్ ఒక ప్రకటన చేసింది. ఇకపై వెబ్ వెర్షన్ జీమెయిల్ యూజర్ల మాదిరిగానే మొబైల్ జీమెయిల్ యాప్ మీకు వచ్చిన మెయిల్స్‌ను.. ఒక భాష నుంచి సుమారు 100 భాషల్లోకి ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మీకు రష్యన్ భాషలో ఏదైనా మెయిల్ వచ్చినప్పటికీ మన భాషలోకి దానిని ట్రాన్స్‌లేట్ చేసుకుని దాని సారాంశాన్ని తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా ఇకపై సైబర్ ఫ్రాడ్ మెయిల్స్ బారి నుంచి రక్షించుకోగలుగుతాము.
జీమెయిల్లో ట్రాన్స్‌లేట్ ఆప్షన్ ఫీచర్ !
0
October 22, 2023
Tags