రెనాల్ట్ సిస్టర్ బ్రాండ్ డాసియా నవంబర్ 29న పోర్చుగల్‌లో కొత్త డస్టర్ ఎడిషన్‌ను అధికారికంగా ఆవిష్కరించనుంది. ఈ 5-సీటర్ వెర్షన్ 2025 నాటికి భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కంపెనీ ఈ కారును 7-సీటర్ వెర్షన్‌లో సైతం అందించనుంది. అయితే దీని లాంచింగ్ గురించి కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. సరికొత్త డస్టర్ మూడు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో లభించే అవకాశం ఉంది. ఇవి వేర్వేరు డ్రైవింగ్ ప్రిఫరెన్స్‌తో రానున్నాయి. ఈ లైనప్‌లో ఎంట్రీ లెవల్ 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 120 bhp పవర్ అవుట్‌పుట్ అందించనుంది. అలాగే 1.2-లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్ 140 bhp పవర్‌ను జనరేట్ చేస్తుంది. లైనప్‌లో బలమైన 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 170 bhp వపర్‌ను ఉత్పత్తి చేస్తుంది. డస్టర్ ప్రొడక్షన్ లైనప్‌లో పవర్‌ఫుల్ కారుగా ఈ హై ఎండ్ ఎడిషన్ నిలవనుంది. 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, CVT ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో వెహికల్ లభిస్తుంది. కొత్త డస్టర్ ఫోటోలు ఇప్పటికే లీక్ అయ్యాయి. వీటిని బట్టి చూస్తే, కొత్త మోడల్ ప్రస్తుత సెకండ్ జనరేషన్ SUV కంటే భిన్నంగా ఉంటుంది. ఈ సరికొత్త వెహికల్ బాక్సీ, రగ్గ్‌డ్ లుక్‌లో కనిపిస్తోంది. చూడటానికి బలమైన ఆఫ్-రోడర్‌గా ఉంటుంది. రెనాల్ట్-నిస్సాన్ సంయుక్తంగా డెవలప్ చేసిన CMF-B మాడ్యులర్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా ఈ వెహికల్‌ను అభివృద్ధి చేశారు. ఇంటీరియర్ అప్‌గ్రేడ్స్‌లో స్మార్ట్‌ఫోన్ కంపాటబిలిటీ, డ్యుయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి వాటితో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ ఉంటుంది. మొత్తానికి డిజైన్ పరంగా కొత్త డస్టర్ మునుపటి మోడళ్ల కంటే పూర్తి భిన్నంగా ఉంది. సరికొత్త డస్టర్ భారత మార్కెట్లో అత్యంత పోటీ ఉండే మిడ్‌రేంజ్ SUV సెగ్మెంట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వంటి వెహికల్స్ సత్తా చాటుతున్నాయి. వీటన్నింటితో కొత్త డస్టర్ పోటీ పడనుంది. మరోవైపు రెనాల్ట్, డాసియా సంయుక్తంగా మూడు వరుసల సీట్లతో మరో వెహికల్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది 'బిగ్‌స్టర్ SUV'గా మార్కెట్లోకి రానుంది. నివేదికల ప్రకారం.. ఈ కారు వచ్చే ఏడాది గ్లోబల్ మార్కెట్లలో అరంగేట్రం చేయనుంది.
రెనాల్ట్ సబ్ బ్రాండ్ డాసియా నుంచి కొత్త డస్టర్ ఎడిషన్ !
0
October 30, 2023
Tags