ఎక్స్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ సర్వీసులలో రెండు కొత్త ప్లాన్స్ మస్క్ పరిచయం చేశారు. వీటి ద్వారా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను మరింత లాభదాయకంగా మార్చాలని ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్ లైవ్ వీడియోలో అప్‌కమింగ్ ఎక్స్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ల వివరాలను కూడా వెల్లడించారు. త్వరలో ఎక్స్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌లలో రెండు ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి. వాటిలో మొదటిది లో-కాస్ట్, రెండోది హై-కాస్ట్. లో-కాస్ట్ సబ్‌స్క్రిప్షన్ ఎక్స్ అన్ని ఫీచర్లను అందిస్తుంది, కానీ ఈ సబ్‌స్క్రిప్షన్ పొందిన వారు ఫీడ్స్‌లో యాడ్స్ చూడాల్సి ఉంటుంది. హై-కాస్ట్ సబ్‌స్క్రిప్షన్ పొందిన వారికి ఎలాంటి యాడ్స్ కనిపించవు. అన్ని ఎక్స్ ఫీచర్లతో పాటు యాడ్స్-ఫ్రీ ఎక్స్‌పీరియన్స్ వారు ఆస్వాదించవచ్చు. ప్రీమియం సర్వీసుల కోసం డబ్బు చెల్లించేందుకు లక్షల మంది యూజర్లు ఆసక్తి చూపుతారని మస్క్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎక్స్ కేవలం యాడ్స్ రెవిన్యూపై మాత్రమే మనుగడ సాగించలేదని, ప్రీమియం సర్వీసుల ద్వారా డబ్బు సేకరించడం తప్పనిసరి అని విశ్వసిస్తున్నారు. భవిష్యత్తులో ఎక్స్ ప్రతి ఒక్కరికీ ఉచితంగా ఉండకపోవచ్చని, ప్లాట్‌ఫామ్‌ను యాక్సెస్ చేయడానికి యూజర్లు మినిమమ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని కూడా మస్క్ సూచించారు. ఎక్స్ ప్లాట్‌ఫామ్‌ను కంప్లీట్‌గా పెయిడ్ ప్లాట్‌ఫామ్‌గా మారిస్తే ప్రపంచవ్యాప్తంగా యూజర్ల నుంచి తీవ్రమైన విమర్శలకు వెల్లువెత్తవచ్చు. ఎందుకంటే చాలా మంది యూజర్లు ఒకప్పుడు ఉచితంగా ఉన్న సర్వీస్ కోసం డబ్బు చెల్లించాల్సి వస్తుంది. డబ్బు చెల్లించాక కూడా ప్రకటనలను చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది వారిలో ఆగ్రహం తెప్పించవచ్చు. ఎక్స్‌లో బాట్‌ల సమస్య తీవ్రంగా ఉందంటూ, దానిని అరికట్టాల్సిన ఏకైక మార్గం ఇదేనంటూ మస్క్ ఈ సమూల మార్పుకు కారణాన్ని వివరించారు. ఎక్స్ సర్వీసుల కోసం యూజర్ల నుంచి ఛార్జీలు వసూలు చేయడం ద్వారా ప్లాట్‌ఫామ్‌ను పీడించే ఫేక్ అకౌంట్స్, స్పామ్ మెసేజ్‌ల సంఖ్యను తగ్గించవచ్చని చెప్పారు. వినియోగదారులందరికీ లో-కాస్ట్ ప్లాన్ అందుబాటులో ఉంటుందని, దీనిని ప్రస్తుతానికి అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ప్లాన్ కచ్చితమైన ధర తెలియదు, కానీ కొన్ని నివేదికలు దాదాపు 1 డాలర్ (సుమారు రూ. 83) ఉండవచ్చని సూచిస్తున్నాయి. కష్టాల్లో ఉన్న X కంపెనీని తన వైపు తిప్పుకోవాలనే ఆశతో 2022లో 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయాలని మస్క్ నిర్ణయం తీసుకున్నారు. లిమిటెడ్ యాడ్ రెవెన్యూ, మునుపటి నిర్వహణ నుంచి భారీ అప్పుల కారణంగా X సంవత్సరాలుగా డబ్బును కోల్పోతోంది. ప్రీమియం సబ్‌స్క్రిప్షన్లను అందించడం ద్వారా, Xని లాభదాయకంగా, స్థిరంగా చేయగలనని మస్క్ నమ్ముతున్నారు.
ఎక్స్ ప్రీమియం సర్వీసుల్లో రెండు కొత్త ప్లాన్లు !
0
October 21, 2023
Tags