అమెజాన్ సేఫ్టీ సెక్యూరిటీ !
Your Responsive Ads code (Google Ads)

అమెజాన్ సేఫ్టీ సెక్యూరిటీ !


మెజాన్ వినియోగదారుల కోసం కొత్త సెక్యూరిటీ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్న సమయంలో కస్టమర్ల సెక్యూరిటీ మెరుగుపర్చడంలో మరో ముందడుగు వేసింది. బ్రౌజర్లు, ఐఓఎస్ మొబైల్ షాపింగ్ యాప్ కోసం పాస్ కీ ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా అమెజాన్ సెట్టింగ్స్ లలో పాస్ కీ సెటప్ చేసుకోవచ్చు. అమెజాన్ ఖాతాలను ఓపెన్ చేయడానికి ఫేస్ రికగ్నిషన్, ఫింగర్ ప్రింట్స్, పిన్ సెటప్ ద్వారా సెక్యూరిటీని మరింత మెరుగు పరిచింది. ఈ కొత్త ఫీచర్ ఇప్పుడు వెబ్ సైట్ బ్రౌజర్లను ఉపయోగించే అమెజాన్ కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. ఇది ఐఓఎస్ అమెజాన్ షాపింగ్ యాప్ లో కూడా పరిచయం చేయనున్నారు. త్వరలో ఆండ్రాయిడ్ వెర్షన్‌కి కూడా సపోర్ట్ చేసేలా తీసుకురానున్నారు. పాస్ కీ ద్వారా ఇప్పుడు ఉపయోగించే పాస్‌వర్డ్ కన్నా ఎక్కువ ప్రయోగజనం కలగనుంది. ఎందుకంటే వీటిని అంత సులభంగా ఊహించని విధంగా ఉంటాయి. దీని ద్వారా అనధికార యాక్సెస్ ప్రమాదం తగ్గుతుంది. ఈ పాస్ కీలలో పుట్టిన రోజు, పేర్లు వంటి సులభమైన పాస్ కీలను అనుమతించరు. కస్టమర్ల ఫింగర్ ప్రింట్స్, ఫేస్ స్కాన్ లేదా లాక్ స్క్రీన్ పిన్ ద్వారా తమ డివైజ్ లను అన్ లాక్ చేసిన విధంగానే పాస్ కీలను ఉపయోగించి యాప్‌లు, వెబ్ సైట్లను సైన్ ఇన్ చేయవచ్చు. పాస్‌వర్డ్‌లు, టెక్ట్స్ మెసేజ్ ల ద్వారా డెలివరీ చేయబడే వన్ టైమ్ కోడ్ లతో పోలిస్తే ఈ పాస్ కీ విధానం అదనపు భద్రతను కల్పిస్తుందని చెబుతున్నారు. అదనపు భద్రతతోపాటు వినియోగదారులకు మరింత సులభంగా యాక్సెస్ చేసే అవకాశం ఉండనుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Search This Blog