Ad Code

ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ మెరుగుపర్చుకోవచ్చు !


గూగుల్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ మెరుగుపరచాలనుకునే ఆండ్రాయిడ్ యూజర్ల కోసం సెర్చ్ పేజీ లోనే కొత్త ఫీచర్‌ను లాంచ్ చేస్తోంది. ఈ ఫీచర్‌ 'ఇంగ్లీష్ స్పీకింగ్ ప్రాక్టీస్' కోసం అందుబాటులోకి రానుంది. ఇది అర్జెంటీనా, కొలంబియా, ఇండియా (హిందీ), ఇండోనేషియా, మెక్సికో, వెనిజులాలో త్వరలో అందుబాటులో ఉంటుంది. తర్వాత మరిన్ని దేశాలు విస్తరిస్తుంది. తెలుగు, తమిళం వంటి మరిన్ని భాషలను జోడించాలని కూడా గూగుల్ యోచిస్తోంది. గూగుల్ కంపెనీ తాజాగా ప్రకటించిన ఇంగ్లీష్ స్పీకింగ్ ప్రాక్టీస్ ఫీచర్ అనేది ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఒక ఆహ్లాదకరమైన, ఇంటరాక్టివ్ మార్గం. యూజర్లు ఆండ్రాయిడ్ ఫోన్‌లలో పదాలు లేదా వాక్యాలను ఇంగ్లీషులోకి లేదా దాని నుంచి మాతృభాషలోకి ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. రియల్-లైఫ్ ప్రాంప్ట్‌లతో ఇంగ్లీష్ మాట్లాడే అవకాశాన్ని పొందవచ్చు. ఉదాహరణకు, వివిధ పరిస్థితులలో 'పుస్తకం' అనే పదాన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకోవచ్చు. గూగుల్ సెర్చ్‌లో 'किताब in English' అని టైప్ చేసి ఎంటర్ చేస్తే ఆ పదం బుక్ అని ఇంగ్లీష్‌లో కనిపించడమే కాక కింద 'ప్రాక్టీస్ బుక్' అని ఒక ఫీచర్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయడం ద్వారా యూజర్ ఇంగ్లీష్‌లో బుక్ పదానికి సంబంధించి సమాధానం చెప్పేలా ఒక క్వశ్చన్ గూగుల్ అడుగుతుంది. ఆన్సర్ చేశాక అందులో గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసి కరెక్షన్స్ సజెస్ట్ చేస్తుంది. మిస్టేక్స్ ఏవీ లేకపోతే వెరీ క్లియర్ అనే ఒక ఫీడ్‌బ్యాక్ ఇస్తుంది. యూజర్లు 3 నుంచి 5 నిమిషాల వరకు ఎంతసేపు ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో ఎంచుకోవచ్చు. వారి ఉచ్చారణ, వ్యాకరణం, పదజాలంపై పర్సనలైజ్డ్‌ ఫీడ్‌బ్యాక్ పొందవచ్చు. క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయడానికి డైలీ రిమైండర్లను కూడా సెట్ చేయవచ్చు. ఇంగ్లీష్ వచ్చినవారు హిందీ నేర్చుకోవడానికి కూడా ఈ ఫీచర్ వినియోగించవచ్చు. ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేయడానికి గూగుల్ లాంగ్వేజ్ లెర్నింగ్, టీచింగ్, బోధనా శాస్త్రంలో నిపుణులైన వారితో కలిసి పని చేసింది. యూజర్లు అర్థవంతమైన సందర్భాలలో పదజాలం  నేర్చుకోవడంలో, దానిని బాగా గుర్తుంచుకోవడంలో సహాయపడటానికి రీసెర్చ్-బేస్డ్ మెథడ్స్‌ను గూగుల్ డెవలపర్స్ వినియోగించారు. అలానే యూజర్ల స్పీచ్ సరైన ఉచ్చారణతో మ్యాచ్ చేయడానికి డీప్ అలైన్‌నర్ అనే కొత్త డీప్ లెర్నింగ్ మోడల్‌ను కూడా ఉపయోగించారు. వినియోగదారులు ప్రాక్టీస్ చేయడానికి మరింత కంటెంట్‌ను అందించడానికి గూగుల్ అనేక లాంగ్వేజ్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌లతో కూడా భాగస్వామ్యం కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లకు ఇంగ్లీషును మెరుగ్గా నేర్చుకుని, మరింత కాన్ఫిడెంట్ స్పీకర్స్‌గా మార్చడానికి సహాయం చేయాలనుకుంటున్నారు. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ ఫీచర్ యూజ్‌ఫుల్, ఫన్‌గా ఉంటుందని గూగుల్ భావిస్తోంది. ఈ ప్రోగ్రామ్‌లో ఆసక్తి ఉన్న మరింత మంది పార్ట్‌నర్స్‌తో కలిసి పని చేయడానికి గూగుల్ సిద్ధంగా కూడా ఉంది. ఈ ఫీచర్ గురించి మరింత తెలుసుకునేందుకు https://blog.research.google/2023/10/google-search-can-now-help-with-english-speaking-practice.html?m=1 విజిట్ చేయవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu