Ad Code

దేశీయ మార్కెట్లో జీబ్రానిక్స్ ల్యాప్ టాప్ లు !


జీబ్రానిక్స్ ల్యాప్ టాప్ మార్కెట్లో అడుగుపెట్టింది. ఒకేసారి ఏకంగా ఐదు ల్యాప్ టాప్ లను దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. జీబ్రానిక్స్ ప్రో సిరీస్ వై, ప్రో సిరీస్ జెడ్ పేరిట మొత్తం ఐదు ల్యాప్ టాప్ లను ఒకేసారి ఆవిష్కరించింది. ప్రో సిరీస్ జెడ్ ల్యాప్ టాప్ లో ఓ కొత్త మైల్ స్టోన్ వంటి ఫీచర్ ను జీబ్రానిక్స్ ప్రవేశపెట్టింది. దేశంలో మొట్టమొదటి సారిగా ఓ ల్యాప్ టాప్ లో డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టమ్ ను ఆవిష్కరించింది. ఈ ప్రో సిరీస్ జెడ్ ల్యాప్ టాప్ లలో ఈ ఫీచర్  మంచి సౌండ్ ఎక్స్ పీరియన్స్ ను అందిస్తుంది.  జీబ్రానిక్స్ ప్రో సిరీస్ జెడ్ ల్యాప్ టాప్ ప్రీమియం బలమైన మెటల్ బాడీ ఎన్‌క్లోజర్‌ను కలిగి ఉంటాయి. 15.6-అంగుళాల డిస్‌ప్లే 1080 పిక్సల్స్ రిజల్యూషన్‌లో పూర్తి హై-డెఫినిషన్ లో వైబ్రెంట్ విజువల్స్‌ను అందిస్తుంది. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడి పనిచేస్తుంది. వేగవంతమైన, సమర్థవంతమైన ఇంటెల్ ప్రాసెసర్‌లతో దీనిలో ఉంటాయి. 16జీబీ వరకూ ర్యామ్, 1టీబీ వరకూ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. వీటి ప్రారంభ ధర రూ. 27, 990 నుంచి ఉంటాయి. టైప్-సీ పోర్ట్‌లు, వైఫై, బ్లూటూత్ 5.0, హెచ్డీఎంఐ, మైక్రో-ఎస్డీ, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్‌లు ఉన్నాయి. అధిక సామర్థ్యం కలిగిన పెద్ద బ్యాటరీ టైప్ సీ అడాప్టర్‌తో వస్తుంది. విశాలమైన కీబోర్డ్, స్మూత్ కీస్ట్రోక్‌లను అందిస్తోంది. ఈ ల్యాప్‌టాప్‌లలో టైప్ చేయడం ఒక ఆహ్లాదకరమైన అనుభవం అని కంపెనీ పేర్కొంది. పెద్ద పరిమాణంలో, ఆకర్షణీయ ఆకృతి లో ట్రాక్‌ప్యాడ్ మొత్తం వినియోగాన్ని మెరుగుపరుస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లు సిల్వర్, స్పేస్ గ్రే, గ్లేసియర్ బ్లూ, మిడ్‌నైట్ బ్లూ,సేజ్ గ్రీన్‌లతో సహా ఆకర్షణీయమైన రంగుల శ్రేణిలో అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు తమ ప్రాధాన్యతలకు సరిపోయే శైలిని ఎంచుకోవడానికి అనుమతిస్తుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే 12వ తరం ఇంటెల్ కోర్ ప్రాసెసర్ తో ఈ ల్యాప్ టాప్ రన్ అవుతుంది. డీడీఆర్5 మెమరీ, పీసీఐ ఈ జెన్ 5, వైఫై 6ఈ, థండర్ బోల్ట్ 4 వంటి మరికొన్నింటి సాయంతో ఈ ప్రాసెసర్లు అధిక పనితీరునుకలిగిన హై బ్రీడ్ ఆర్కిటెక్చర్ ను కలిగి ఉంటాయి. జీబ్రానిక్స్ డైరెక్టర్ యష్ దోషి ఈ ల్యాప్ టాప్ లాంచ్ సమయంలో మాట్లాడుతూ అత్యున్నత స్థాయి సాంకేతికతను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి బ్రాండ్ నిబద్ధతతోనే పనిచేస్తుందన్నారు. కంటెంట్ సృష్టికర్తలు, గేమర్‌ల కోసం కొత్త వేరియంట్ ల్యాప్‌టాప్‌లను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. డాల్బీ లేబొరేటరీస్, జెబ్రోనిక్స్‌తో భాగస్వామ్యం ఏర్పడి వినియోగదారులకు మంచి సౌండ్ క్లారిటీని ల్యాప్ టాప్ ద్వారా అందిస్తున్నట్లు డాల్బీ లేబొరేటరీస్‌లోని సీనియర్ డైరెక్టర్ కమర్షియల్ పార్టనర్‌షిప్స్ డైరెక్టర్ కరణ్ గ్రోవర్ చెప్పారు. నిజంగా ఆకర్షణీయమైన ఆడియోవిజువల్ వినియోగదారులు ఆస్వాదిస్తారని వివరించారు. ల్యాప్‌టాప్ మార్కెట్‌లోకి జెబ్రోనిక్స్ ఒక సాహసోపేతమైన ముందుడగు వేసిందని, ఇది ల్యాప్ టాప్ ల వినియోగంలో కొత్త రికార్డు సృష్టిస్తుందని పేర్కొన్నారు.

Post a Comment

0 Comments

Close Menu