Ad Code

బజాజ్ నుంచి తొలి సీఎన్‌జీ బైక్ ?


జాజ్ కంపెనీ నుంచి సీఎన్‌జీ బైక్ రానుందని సమాచారం. ఇప్పటికే సీఎన్‌జీ బైక్‌కు సంబంధించిన పనులు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ‘బజాజ్ 110 సీసీ ప్లాటినా’ బైక్ సీఎన్‌జీ వేరియెంట్‌లో రానున్నట్లు సమాచారం.ఈ బైక్‌కి బ్రూజర్ ఈ101 అనే పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ బైక్ అభివృద్ధి చివరి దశలో ఉందట. సీఎన్‌జీతో పాటు పెట్రోల్‌పై కూడా ఈ బైక్ రన్ అవుతుంది. రానున్న 6 నుంచి 12 నెలల్లో ఈ బైక్ అమ్మకానికి వస్తుందట. బ్రూజర్ ఈ101 సీఎన్‌జీ బైక్.. లాంచ్ తర్వాత ప్లాటినా నేమ్‌ ట్యాగ్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇది బజాజ్‌కి మంచి మార్కెట్ అందిస్తుందని కంపెనీ భావిస్తోంది. సంవత్సరానికి 1-1.2 లక్షల సీఎన్‌జీ బైక్‌లను ఉత్పత్తి చేయడాన్ని బజాజ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే రానున్న రోజుల్లో ఏడాదికి రెండు లక్షల యూనిట్లు తయారు చేసేలా ప్లాన్ చేసిందట. తొలుత ఔరంగాబాద్‌లో ఉత్పత్తి చేయాలని, ఆపై పంత్‌నగర్‌లో ఉత్పత్తి చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఈ బైక్ మైలేజీ, ధర డీటెయిల్స్ ఇంకా తెలియరాలేదు. ప్రజలకు వాహన నిర్వహణ ఖర్చును తగ్గించడమీ కాకుండా కాలుష్యాన్ని కూడా సీఎన్‌జీ తగ్గిస్తుందన్న విషయం తెలిసిందే.

Post a Comment

0 Comments

Close Menu