Ad Code

భారీగా పెరిగిన స్మార్ట్ టీవీల అమ్మకాలు !


వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లు పితృ పక్షం లేదా శ్రాద్ కాలం  సమయంలోనే జరుగుతున్నాయి. ఈ ఏడాది పితృ పక్షం సెప్టెంబర్ 29 నుంచి ప్రారంభంగా కాగా అక్టోబర్‌ 14న ముగుస్తుంది. ఈ సమయంలో హిందువులు పూర్వీకులను గౌరవించే ఆచారాలను పాటిస్తారు. ఎలక్ట్రానిక్స్, టీవీలు వంటి కొత్త వస్తువులను కొనుగోలు చేయరు. కానీ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌లను హై డెఫినిషన్‌లో ఆస్వాదించడానికి చాలా మంది భారతీయులు ఈ ఆచారాలను పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. ఎందుకంటే రీసెంట్ టైమ్‌లో కొత్త బిగ్ స్క్రీన్‌ టీవీలను చాలా ఎక్కువగా కొనుగోలు చేశారు.  టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం, పితృపక్షం సమయంలో షియోమీ, ఎల్‌జీ, సోనీ, పానాసోనిక్ వంటి అనేక బ్రాండ్‌ల టీవీలకు, ముఖ్యంగా 55 అంగుళాలు, అంతకంటే ఎక్కువ ఉన్న పెద్ద మోడళ్లకు డిమాండ్ పెరిగింది. ఆన్‌లైన్ రిటైలర్లు ఫెస్టివల్ సీజన్‌లో కస్టమర్‌లకు ఆకర్షణీయమైన డిస్కౌంట్స్, డీల్స్‌ను కూడా అందించడంతో భారీ ఎత్తున అమ్ముడుపోయాయి. ఈ బ్రాండ్‌లలో కొన్ని కొనుగోలుదారుల డిమాండ్స్‌కు తగినన్ని టీవీలు సప్లై చేయలేక కష్టపడుతున్నాయి. భారత్ పాకిస్థాన్‌తో శనివారం తలపడనున్న నేపథ్యంలో ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ తారస్థాయికి చేరుకోనుంది. ఈ టైమ్‌లో టీవీ సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఎల్‌జీ ఇండియా హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బిజినెస్ హెడ్ గిరీశన్ గోపి ది టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ... బిగ్ స్క్రీన్ టీవీల అమ్మకాలు గత ఏడాది పితృపక్షం కాలంతో పోలిస్తే ఈసారి 2 నుంచి 2.5 రెట్లు పెరిగాయని చెప్పారు. సోనీ ఇండియా MD సునీల్ నయ్యర్ కూడా ఇదే ట్రెండు కొనసాగుతున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియాతో తెలిపారు. క్రికెట్ ప్రపంచ కప్‌ కారణంగా సోనీ 75-అంగుళాల, 85-అంగుళాల మోడల్స్‌ బాగా సేల్ అవుతున్నాయని చెప్పారు.

Post a Comment

0 Comments

Close Menu