ఎలక్ట్రానిక్స్ దిగుమతులపై ఆంక్షలను వెనక్కి తీసుకున్న కేంద్రం !
Your Responsive Ads code (Google Ads)

ఎలక్ట్రానిక్స్ దిగుమతులపై ఆంక్షలను వెనక్కి తీసుకున్న కేంద్రం !


దేశీయంగా ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఈ వర్గానికి చెందిన మెషిన్ల దిగుమతిపై ఆంక్షలు విధిస్తున్నట్లు ఈ ఆగస్టులో ప్రకటించింది. అయితే ప్రస్తుతానికి ల్యాప్‌టాప్‌ల దిగుమతులపై ఎటువంటి ఆంక్షలు విధించకూడదని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మునుపటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ల్యాప్‌టాప్స్‌ దిగుమతిదారులపై ప్రభుత్వం నిఘా ఉంచాలని కోరుకుంటోందని, అంతేకానీ ఎలాంటి నిషేధాలు విధించడం లేదని వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్త్వాల్ తెలిపారు. ఈ విషయంపై ప్రభుత్వం పరిశ్రమతో సంప్రదింపులు జరుపుతోందని, అక్టోబర్ చివరి నాటికి ల్యాప్‌టాప్ దిగుమతులపై కొత్త విధానాన్ని కేంద్రం ప్రకటిస్తుందని నివేదికలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మేడ్ ఇన్ ఇండియా పాలసీని ప్రోత్సహిస్తోంది. భారతదేశంలోనే వివిధ రకాల ప్రొడక్ట్స్ తయారు చేసేలా బిజినెస్ ఇండస్ట్రీలకు ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఫలితంగా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు తమ ఉత్పత్తులను దేశంలో తయారు చేయడంతో పాటు అసెంబుల్ చేయడం ప్రారంభించాయి. ఇప్పుడు భారత్ నుంచి ఇతర దేశాలకు ఫోన్లు ఎగుమతి అవుతున్నాయి. చిప్‌మేకర్లు, సెమీకండక్టర్ తయారీ కంపెనీలు కూడా భారతదేశంలో తయారీ యూనిట్లు నెలకొల్పేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో సర్వర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్‌లు, పర్సనల్ కంప్యూటర్ల దిగుమతిపై కేంద్ర ప్రభుత్వం ఆగస్టులో ఆంక్షలు విధించింది. పేర్కొన్న వస్తువులు భారత్‌కు ఇంపోర్ట్ చేయడానికి లైన్సెన్స్ తీసుకోవాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొంది. వినియోగానికి తీసుకొచ్చే ఉత్పత్తులను పరిమితుల నుంచి మినహాయించామని ప్రకటించింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Search This Blog