Ad Code

గూగుల్‌ సూపర్‌ యాప్‌ ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ !


న్యూఢిల్లీలో జరిగిన తొమ్మిదవ వార్షిక గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్‌లో సామాన్య ప్రజలకు ఉపయోగపడేలా గూగుల్‌ ఒక సూపర్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యాక్సిస్‌ మై ఇండియా సహకారంతో రూపొందిన ఈ యాప్‌ను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) మంత్రి అశ్విని వైష్ణవ్ ఆవిష్కరించారు. గూగుల్‌ ఫర్‌ ఇండియా 2023 ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన ఈ సూపర్‌ యాప్‌ను ఆవిష్కరించారు. ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సహకారంతో గూగుల్‌ ఈ యాప్‌ను రూపొందించింది. ఈ సూపర్ యాప్‌కి లాగిన్ చేయడానికి మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. ఈ యాప్ ప్రజలకు ప్రభుత్వ పథకాలు, ఇతర సేవల గురించి సమస్త సమాచారాన్ని అందిస్తుంది. యాక్సిస్ మై ఇండియా, గూగుల్ సంయుక్తంగా తయారు చేసిన ఈ యాప్ ప్రత్యేకత ఏంటంటే ఈ యాప్‌లో వాయిస్ యాక్టివేటెడ్ పర్సనల్ అసిస్టెంట్ సదుపాయం ఉంటుంది. ఇది మాత్రమే కాదు, ఈ యాప్ ద్వారా ఆయుష్మాన్ భారత్, వ్యవసాయం, ప్రభుత్వ పథకాలు, ఉపాధితో సహా అనేక విషయాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు, ఈ యాప్ సహాయంతో మన సమీపంలో ఏయే ఆయుష్మాన్ భారత్ హాస్పిటల్స్ ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు. అలాగే రైతులు ఈ యాప్ ద్వారా తమ పంటలకు కనీస మద్దతు ధర ఎక్కడ లభిస్తుందో కనుక్కోవచ్చు. ఈ సూపర్‌ యాప్‌ మరో స్పెషాలిటీ ఏంటంటే మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్‌తో రూపొందడం. ఈ యాప్ సాధారణ ప్రజల సౌలభ్యం కోసం తయారు చేశారు కాబట్టి 13 విభిన్న భాషలలో ఈ యాప్‌ పనిచేస్తుంది. అంటే మనకు ఇష్టమైన భాషలో సమాచారాన్ని పొందవచ్చు. కాగా ఈ సూపర్‌ యాప్‌ గురించి కేంద్ర మంత్రి అ శ్విని వైష్ణవ్‌ ట్వీట్‌ చేశారు.  

Post a Comment

0 Comments

Close Menu