Ad Code

సెడాన్ 'సీల్‌' EV కారు విడుదల !


బీవైడీ సరికొత్త ఫీచర్లతో మరో EV కారు మోడల్ విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ కారు పేరు 'సీల్‌' అని పెట్టారు. అయితే తొలుతగా ఈ కారును థాయ్‌లాండ్‌లో లాంచ్ చేయడం జరిగింది. అతిత్వరలో ఇండియాలో లాంచ్ చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తం మూడు వేరియంట్‌ల్లో ఈ కారును లాంచ్ చేశారు. డైనమిక్ వేరియంట్ 61.4 కేడబ్ల్యూహెచ్ ఎల్ఎఫ్‌పీ బ్లేడ్ బ్యాటరీల జత కలిగి ఉంటుంది. 204 హెచ్‌పీ పవర్ ఉన్న ఎలక్ట్రిక్ మోటార్ తో ఈ కారు ముందుకు వెళుతుంది. ఈ వేరియంట్ ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఏకంగా 510 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేస్తుంది. మరో వేరియంట్ లో 82.5 కేడబ్ల్యూహెచ్ ఎల్ఎఫ్‌పీ బ్లేడ్ బ్యాటరీల జత కలిగి ఉంటుంది. 313 హెచ్‌పీ పవర్ ఉన్న ఎలక్ట్రిక్ మోటార్ తో ఈ కారు ముందుకెళ్తుంది. ఈ కారు ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఏకంగా 650 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేస్తుంది. ఓషన్ బార్ తరహాలో డిజైన్ చేయబడి ఉంటుంది. ఇది ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ కారు ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే చాలా ఖరీదు అని చెప్పుకోవచ్చు. ఇండియన్ రూపీలో ఈ కారు ధర 29.8 లక్షలు. అంటే భారతదేశంలో ఇప్పటికే మార్కెట్ లో ఉన్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఎంజీ జెడ్ఎస్ ప్రో డీటీ (ఆన్ రోడ్ దాదాపు 29.6 లక్షలు)కి దాదాపు సమానం అని చెప్పుకోవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu