యూట్యూబ్‌లో హమ్ చేయడం లేదా ట్యూన్ పాడడం ద్వారా సాంగ్‌ని సెర్చ్ చేయవచ్చు. ఈ స్పెషల్‌ఫీచర్ గూగుల్ సెర్చ్, గూగుల్ యాప్, గూగుల్ అసిస్టెంట్ లో ఉన్న హమ్-టు-సెర్చ్ ఫంక్షనాలిటీని పోలి ఉంటుంది. యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత, టాప్ రైట్ కార్నర్‌లో ఉన్న సెర్చ్ ఐకాన్‌పై క్లిక్ చేయండి. సెర్చ్ బార్ పక్కనే మైక్రోఫోన్ ఐకాన్ కనిపిస్తుంది. మైక్రోఫోన్ సింబల్‌పై క్లిక్ చేసిన తర్వాత, ఫీచర్‌ని యూజ్ చేయడానికి, డివైజ్ మైక్రోఫోన్‌కు యూట్యూబ్ యాక్సెస్ పర్మిషన్ అందజేయాలి. యాప్‌ను యాక్టివ్‌గా ఉపయోగిస్తున్నప్పుడు మాత్రమే యాక్సెస్ అందించే ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. ప్రైవసీ ప్రాబ్లమ్స్ తలెత్తితే నిలిపివేయవచ్చు. ఇప్పుడు సెర్చ్ చేయాలనుకుంటన్న ట్యూన్‌ని హమ్మింగ్, సింగింగ్, లేదా ఈలలు వేయడం ద్వారా సెర్చ్ చేయండి. మీ గాత్రం ఆధారంగా పాటను సెర్చ్ చేయడానికి యూట్యూబ్ ప్రయత్నిస్తుంది. పాటను విజయవంతంగా గుర్తిస్తే, మీరు కరెక్ట్ ఆన్సర్‌పై ట్యాప్ చేయవచ్చు. లేదా మరోసారి ట్యూన్‌ని హమ్ చేసి ట్రై చేయవచ్చు. యూట్యూబ్ వినియోగదారులందరికీ ఈ ఫీచర్‌కి యాక్సెస్ ఉండకపోవచ్చని గమనించడం ముఖ్యం. యూట్యూబ్ ఈ లేటెస్ట్ ఫీచర్‌ని క్రమంగా ఇంట్రడ్యూస్ చేస్తోంది. ప్రధానంగా యాప్ బీటా వెర్షన్‌లో భాగమైన ఆండ్రాయిడ్ యూజర్లకు అందిస్తోంది. దురదృష్టవశాత్తూ iOS యూజర్లకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే అంశంపై స్పష్టత లేదు. అధికారికంగా ఎలాంటి టైమ్‌లైన్ ప్రకటించలేదు. దేశంలోని యూజర్ల కోసం మ్యూజిక్ డిస్కవరీ ప్రాసెస్‌ని యూట్యూబ్ సులభతరం చేస్తోంది. సాంగ్ లిరిక్స్ కోసం అవిశ్రాంతంగా సెర్చ్ చేసే రోజులు లేదా షాజామ్ వంటి ఎక్సటెర్నల్ యాప్‌లపై ఆధారపడే రోజులు తగ్గిపోతున్నాయి. అందరికీ పరిచయమున్న యూట్యూబ్‌లోనే ఇప్పుడు ఈజీగా హమ్ చేసి పాటను కనిపెట్టేయవచ్చు.
ట్యూన్ హమ్ చేసి సాంగ్ కనిపెట్టేయవచ్చు i
0
October 21, 2023
Tags