Ad Code

షియోమీ ఫోన్లలో MIUIకి బదులుగా MiOS ప్లాట్‌ఫామ్‌ !


ఇండియాలో షియోమీ ఫోన్స్ అమ్మకాల జోరు తగ్గింది. శామ్‌సంగ్, వివో, ఒప్పో, రియల్‌మీ కంపెనీలు ఇండియన్ మార్కెట్లో అద్భుతమైన ఫీచర్లతో సరసమైన ధరలకే ఫోన్లను తీసుకొస్తున్నాయి. ఈ పోటీని కంపెనీ తట్టుకోలేకపోతోంది. వీటికి మించి మెరుగైన యూజర్ ఎక్స్‌పీరియన్స్, కొత్త ఫీచర్లు అందించి ప్రపంచవ్యాప్తంగా సేల్స్ పెంచుకోవాలని కంపెనీ చూస్తోంది. ఆ ప్రయత్నాల్లో భాగంగా ప్రస్తుతం షియోమీ MIUI ఆండ్రాయిడ్ స్కిన్‌ను MiOS అనే కొత్త ప్లాట్‌ఫామ్‌తో భర్తీ చేయాలని చూస్తోంది. ఎమ్ఐయూఐ 13 సంవత్సరాలకు పైగా ఫోన్లలో ఉంటోంది. దీని స్థానంలో కొత్త UI తీసుకురావడం ఒక పెద్ద మార్పు అని చెప్పవచ్చు. MiOS మరొక ఆండ్రాయిడ్ స్కిన్ అవుతుందా లేదా పూర్తిగా కొత్త ఆపరేటింగ్ సిస్టమా అనే దానిపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. అయితే యాపిల్ iOS, మ్యాక్ఓఎస్ పేర్ల లాగానే షియోమీ MiOS పేరు కూడా ఉండటం చూస్తుంటే.. షియోమీ డిజైన్, ఫంక్షనాలిటీ పరంగా యాపిల్ నుంచి ఇన్‌స్పైర్ అయి ఈ కొత్త MiOS తీసుకొస్తోందని అర్థం అవుతోంది. కొంతమంది MiOS కొత్త ఆండ్రాయిడ్ స్కిన్ అని విశ్వసిస్తుండగా, మరికొందరు ఇది కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ అని నమ్ముతున్నారు. షియోమీ ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ ని ఉపయోగించి MiOSను అభివృద్ధి చేసే అవకాశం కూడా ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. అదే పద్ధతిలో డెవలప్ చేస్తే ఆ OS ఆండ్రాయిడ్ యాప్స్‌కు సపోర్ట్ చేయవచ్చు. MiOS ఎలా ఉంటుందో తెలియ రాలేదు కానీ షియోమీ ప్రస్తుతం ఫోన్లలో ఇస్తున్న ఆండ్రాయిడ్‌కి ఇది భిన్నంగా ఉండే అవకాశం ఎక్కువ. ఎందుకంటే షియోమీ ఇప్పటికే MiOS పేరు, mios.cn డొమైన్‌ను ప్రత్యేకంగా ట్రేడ్‌మార్క్ చేసింది. దీన్ని బట్టి అది సొంత ఓఎస్ కావచ్చని తెలుస్తోంది. చైనీస్ మీడియాలో MiOS డెవలపర్ బీటా సర్కులేట్ అవుతున్నట్లు కూడా రిపోర్ట్స్ వచ్చాయి. షియోమీ లవర్స్‌కు ఇది ఒక ఎగ్జైటింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే కంపెనీ సొంత సాఫ్ట్‌వేర్ ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తుంది. ఆండ్రాయిడ్ ఓఎస్ ఉపయోగించకుండా యూఎస్ ప్రభుత్వం బ్యాన్ చేశాక హువావే సొంత ఆపరేటింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది, దీనిని హార్మోనీఓఎస్ అని పిలుస్తారు, దీనిని చైనీస్‌లో హాంగ్‌మెంగ్ OS అని కూడా అంటారు. హువావే లాగానే షియోమీ కూడా సొంత OS డెవలప్ చేసే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. షియోమీ చైనా, భారతదేశం/యూరోప్ కోసం రెండు వేర్వేరు మొబైల్ ప్లాట్‌ఫామ్‌లను ఆఫర్ చేస్తోంది. అంటే ఈ రెండు ప్రాంతాల్లోని వినియోగదారులకు కంపెనీ విభిన్న ఫీచర్లు, సేవలను అందిస్తోంది. చైనాలోని షియోమీ MIUI ప్లాట్‌ఫామ్ భారతదేశం/యూరోప్‌లో అందుబాటులో లేని అనేక ఫీచర్లు, సేవలను అందిస్తుంది. షియోమీ చైనీస్ వినియోగదారుల నిర్దిష్ట అవసరాలు తీర్చాలన్న ఉద్దేశంతో వేరే ఫీచర్లను ఆఫర్ చేస్తుంటుంది. షియోమీ MiOSతో కూడా అదే పని చేసే అవకాశం ఉంది. ఉదాహరణకు, ఆరిజిన్ OSతో వివో చేసినట్లే, కంపెనీ చైనాలోని యూజర్లకు మాత్రమే MiOSను అందుబాటులోకి తేవచ్చు. MiOS గూగుల్ యాప్‌లు అవసరం లేని పూర్తిగా కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు. ఈ సంవత్సరం చివరిలో షియోమీ 14 సిరీస్ లాంచ్‌లో దీనిని ప్రకటించవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu