అమెరికాకు చెందిన ఈవెంట్ బ్రైట్ టెక్ కంపెనీ. ఈవెంట్ ఆర్గనైజింగ్ సేవలను దాదాపు 180 దేశాలలో అందించే ఈ సంస్థ తమ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్‌ను హైదరాబాద్ కేంద్రంగా 2022 సంవత్సరంలో ప్రారంభించింది. నాటి నుంచి ఈ సంస్థ హైదరాబాద్, బెంగుళూరు, ముంబై, ఢిల్లీ మొదలైన మహానగరాలతో పాటు గుంటూరు, జార్ఖండ్, వారణాసి, తిరువణ్ణామలై, భయవదర్, బెర్హంపూర్, మాండ్లా, భుజ్, జునాగఢ్, ధరంపూర్ వంటి మారుమూల ప్రాంతాలకు చెందిన విభిన్న ప్రతిభావంతులను ఉద్యోగాల్లోకి తీసుకుంది. కరోనా సంక్షోభం తర్వాత ఇతర బడా టెక్ కంపెనీలు ఉద్యోగులను తిరిగి ఆఫీసు నుంచి పని చేయడానికి పిలుస్తుండగా, ఈవెంట్ బ్రైట్ మాత్రం తమ ఉద్యోగులకు రిమోట్‌గా పనిచేయడానికి అనుమతిస్తోంది. ఈనేపథ్యంలో ఈవెంట్ బ్రైట్ కంపెనీకి వస్తున్న నెలవారీ జాబ్ అప్లికేషన్ల సంఖ్య ఈ సంవత్సరం ప్రారంభం నుంచి దాదాపు రెట్టింపు అయింది. ఐటీ నిపుణులు ఈవెంట్ బ్రైట్‌లో చేరడానికి ఆసక్తి కనబరుస్తున్నారు అనేందుకు ఇదే సంకేతం. హైదరాబాద్‌లోని కంపెనీ వర్క్ హబ్ నుంచి పనిచేయొచ్చు. లేదంటే హైబ్రిడ్‌గా పని చేయొచ్చు. వీటిలో ఏ ఆప్షన్‌ను అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. భారతదేశంలోని ఈవెంట్ బ్రైట్ కంపెనీ ఉద్యోగుల్లో నాలుగింట ఒక వంతు హైదరాబాద్‌లోనే ఉన్నప్పటికీ, వారిలో ఎక్కువ మంది ఇంటి నుంచే పని చేస్తున్నారు. వారిలో ఇంకొందరు వారానికి ఒకసారి హైదరాబాద్ ఆఫీస్‌కి వచ్చి వర్క్ చేస్తుంటారు. ప్రత్యేకించి బెంగుళూరు నుంచి పని చేస్తున్న ఉద్యోగులు రిమోట్‌గా పని చేయడానికి ప్రయారిటీ ఇస్తున్నారు. దీనివల్ల తమ ప్రయాణ సమయం చాలా ఆదా అయిందని బెంగళూరులో రిమోట్‌గా పనిచేసే ఈవెంట్ బ్రైట్ ఎంప్లాయీస్ అంటున్నారు. ఇలా మిగిలే సమయాన్ని తాము కంపెనీ కోసమే వెచ్చిస్తున్నామని చెబుతున్నారు. ఈవెంట్ బ్రైట్ కంపెనీ లాగిన్, లాగ్ అవుట్ సమయాలను పర్యవేక్షించకుండా పూర్తి సౌలభ్యాన్ని అందిస్తోంది. దీంతోపాటు ట్రస్ట్ అండ్ డెలివరీ సంస్కృతిని పెంచి పోషిస్తోంది. ఉద్యోగుల ప్రొడక్టివిటీ అనేది కంప్యూటర్ ముందు గడిపిన గంటలతో కొలవబడదు. కానీ వారు జాబ్ రోల్‌లో సృష్టించే ప్రభావంతో ప్రొడక్టివిటీని లెక్కిస్తారు. ఉద్యోగులకు నైపుణ్యం, అనుభవం, పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలు, వేతనం, ఇతర ప్రయోజనాలు లభిస్తాయి. హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్, ఎర్గోనామిక్ కుర్చీలు, వర్క్ డెస్క్‌లు మొదలైనవాటిని కలిగి ఉన్న రిమోట్ ఆఫీస్ లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్‌ని సెటప్ చేయడానికి ఉద్యోగులకు ప్రత్యేకంగా 10వేల నెలవారీ రీయింబర్స్‌మెంట్ కూడా ఈవెంట్ బ్రైట్ కంపెనీ అందిస్తోంది. స్టాండర్డ్‌గా, అవసరమైన అన్ని సాఫ్ట్‌వేర్, అప్లికేషన్‌లతో పని చేయడానికి MacBook ల్యాప్‌టాప్ ఉద్యోగి ఎక్కడ ఉన్నా వారి ఇంటికి డెలివరీ చేయబడుతుంది.ఈవెంట్ బ్రైట్ కంపెనీ APIలు, బిగ్ డేటా, మెషిన్ లెర్నింగ్ వంటి వాటిపైనా పనిచేస్తోంది. పెయిర్ ప్రోగ్రామింగ్, వీక్లీ డెమోలు, టెక్నికల్ టాక్‌లు, హ్యాకథాన్‌ల ద్వారా ఈవెంట్ బ్రైట్ కంపెనీ తమ ఉద్యోగులను నిత్యం యాక్టివేట్‌గా ఉంచుతుంది. ఉద్యోగులంంతా కంపెనీని తమదిగా భావించే వాతావరణంలో పనులు జరుగుతుంటాయి.
0 Comments