Ad Code

డిసెంబర్ 12న దేశీయ మార్కెట్లో ఐక్యూ 12 విడుదల


డిసెంబర్ 12న  దేశీయ మార్కెట్లో ఐక్యూ 12ని లాంచ్ చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈనెల 7న ఈ ఫోన్లు గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయ్యాయి. అమెజాన్ లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన మైక్రో సైట్ కూడా లైవ్ అయింది. బర్నింగ్ వే, లెజెండ్ ఎడిషన్, ట్రాక్ వెర్షన్ కలర్ ఆప్షన్లలో వస్తున్నాయి. ఇందులో ట్రాక్ వెర్షన్ వేరియంట్ బీఎండబ్ల్యూ మోటార్ స్పోర్ట్ ఇన్ స్పైర్డ్ డిజైన్ తో రానుంది. ఐక్యూ 12 బేస్ మోడల్ కు సంబంధించిన మైక్రో సైట్ అమెజాన్ ఇండియా వెబ్ సైట్లో లైవ్ అయింది. చైనాలో ఈ మొబైల్ మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. వీటిలో 12 జీబీ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,999 యువాన్లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.45,000) నిర్ణయించారు. ఇక 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 4,299 యువాన్లుగానూ (మనదేశ కరెన్సీలో సుమారు రూ.50,000), 16 జీబీ ర్యామ్ + 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 4,699 యువాన్లుగానూ (మనదేశ కరెన్సీలో సుమారు రూ.53,000) నిర్ణయించారు. 6.78 అంగుళాల అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. 1.5కే రిజల్యూషన్, 144 హెర్ట్జ్ వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో, హెచ్డీఆర్10+ సపోర్ట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఆక్టాకోర్ 4ఎన్ఎం క్వాల్కాం స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పని చేయనుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 4 ఆపరేటింగ్ సిస్టంపై ఫోన్ రన్ కానుంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 64 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరా ఉంది. 100X డిజిటల్ జూమ్ను ఈ లెన్స్ సపోర్ట్ చేయనుంది. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సెన్సార్ అందుబాటులో ఉంది. బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా 120W ఫాస్ట్ ఛార్జింగ్ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. సెక్యూరిటీ కోసం ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అందుబాటులో ఉంది. దీని మందం 0.81 సెంటీమీటర్లు కాగా, బరువు 203 గ్రాములుగా ఉంది.


Post a Comment

0 Comments

Close Menu