Ad Code

సెకన్ కు 1.2 టెరాబైట్ డేటాను ప్రసారం - సెకన్‌లో 150 సినిమాలు డౌన్‌లోడ్‌ !


సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం ఒక్క సెకన్ లో 150 హెచ్ డీ సినిమాలు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. సెకన్ కు 1.2 టెరాబైట్ డేటాను ప్రసారం చేయగల సామర్థ్యంగల టెక్నాలజీని  చైనా రూపొందించింది. ప్రపంచంలో ఉన్న ఇంటర్ నెట్ వేగం కన్నా ఇది పదింతల వేగవంతమైంది. ఈ ప్రాజెక్టు ను చైనాలోని సింఘోవా యూనివర్శిటీ, చైనా మొబైల్, హువాయ్ టెక్నాలజీస్, సెర్నెట్ కార్పొరేషన్ సంయుక్తంగా చేపట్టాయి. చైనాలో 3500 కిలోమీటర్లకు పైగాఈ నెట్ వర్క్ విస్తరించి ఉంది. ఇది బీజింగ్, వూహాన్, గ్వాంగ్జూలను విస్త్రృతమైన ఆప్టికల్ ఫైబర్ కేబులింగ్ సిస్టం ద్వారా అనుసంధానం చేస్తోంది. సెకనుకు 1.2 టెరాబైట్ ల డేటాను ప్రసారం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇప్పటికి ఇదే అత్యధిక పొటెన్షియల్ కలిగింది. అమెరికా సెకెన్ కు 400 గిగా బైట్ల వేగంతో 5 జీ ఇంటర్ నెట్ ను ఆవిష్కరించింది. ముఖ్యంగా బీజింగ్ వూహాన్ గ్వాంగ్జూ కనెక్షన్ చైనా భవిష్యత్తు ఇంటర్ నెట్ టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్టక్చర్ లో భాగం. దీనికోసం జాతీయ చైనా ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నెట్ వర్క్ దశాబ్దం పాటు కృషి చేసింది. జులైలో యాక్టివ్ చేసిన ఈ ప్రాజెక్టును సోమవారం అధికారకంగా ప్రారంభించారు. నెట్ వర్క్ అన్నీ ఆపరేషనల్ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకొని సమర్థంగా పనిచేస్తుందని అధికారులు చెబుతున్నారు. హువాయ్ టెక్నాలజీ వైస్ ప్రసిడెంట్ వాంగ్ లీ మాట్లాడుతూ నెట్ వర్క్ ఎంత వేగంగా ఉందో అర్థం చేసుకోవడానికి ఇదో ఉదాహరణ అని పేర్కొన్నారు. 

Post a Comment

0 Comments

Close Menu