ప్రముఖ ఎడ్యుటెక్ స్టార్టప్ ఫిజిక్స్‌వాలా 120 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్టుతెలిసింది. స్టార్టప్‌లు ఆర్ధిక సమస్యలను ఎదుర్కొంటుండటంతో లేఆఫ్స్ లేటెస్ట్ ట్రెండ్‌గా ముందుకొచ్చింది. ఉద్యోగుల సామర్ధ్యాలను సమీక్షించే క్రమంలో పలువురు ఉద్యోగులపై ఫిజిక్స్‌వాలా వేటు వేసిందని చెబుతున్నారు. ఖర్చులను తగ్గించుకునేందుకే ఫిజిక్స్‌వాలా ఉద్యోగులను తొలగించిందని జాబ్‌కట్స్‌పై తొలుత సమాచారం అందించిన ఎన్‌ట్రాకర్ పేర్కొంది. కంపెనీ లాభాల బాటపట్టి యూనికార్న్ హోదాను గతేడాది సాధించగా తాజా లేఆఫ్స్ ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తాము ఏటా చేపట్టే మధ్యంతర, సంవత్సరాంత ఉద్యోగుల సమీక్షలో భాగంగా 120 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించామని ఫిజిక్స్‌వాలా సీహెచ్ఆర్వో సతీష్ ఖెంగ్రే పేర్కొన్నారు. భారత్‌లో ఆర్ధిక మందగమన పరిస్ధితుల్లో టెక్ స్టార్టప్‌ల్లో లేఆఫ్స్ పెరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్ధితుల్లో టెక్ పరిశ్రమ సవాళ్లను అధిగమించడంలో సమస్యలు ఎదుర్కొంటోంది. ప్రస్తుత వృద్ధి రేటును నిలకడగా కొనసాగించడంలో ఇబ్బందులు ఎదురవడంతో వ్యయ నియంత్రణ చేపట్టి పోటీకి దీటుగా నిలబడేందుకు లేఆఫ్స్‌కు తెగబడుతున్నాయి.
ఫిజిక్స్‌వాలాలో 120 మంది ఉద్యోగుల తొలగింపు !
0
November 20, 2023
Tags