Ad Code

13" మ్యాక్‌బుక్ ప్రో మోడల్‌ను తయారీ నిలిపివేత !


టీవల 14-అంగుళాలు, 16-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో  అప్‌డేటెడ్ వెర్షన్ ల్యాప్‌టాప్స్, అప్‌గ్రేడెడ్ 24-అంగుళాల ఐమ్యాక్ డెస్క్‌టాప్ లను విడుదల చేసింది. ఈ కొత్త ప్రొడక్ట్స్ యాపిల్ కొత్త 3nm M3 ప్రాసెసర్స్‌తో వస్తాయి.  కొత్త ప్రొడక్ట్స్‌ను యాపిల్ విడుదల చేయడమే కాకుండా 13 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో మోడల్‌ను తయారు చేయడం ఆపేసింది. ఈ మ్యాక్‌బుక్ ప్రో 13-అంగుళాల మోడల్ టచ్ బార్‌ ను ఆఫర్ చేస్తుంది. టచ్ బార్ అనేది యూజర్లు మ్యాక్‌బుక్‌తో ఇంటరాక్ట్ కావడానికి మరింత స్పష్టమైన, డైనమిక్ మార్గాన్ని అందించాలనే ఉద్దేశంతో 2016లో యాపిల్ ప్రవేశపెట్టిన ఒక ఎక్స్‌పరిమెంటల్ ఫీచర్. ఇది యూజర్లు లేదా క్రిటిక్స్‌ను పెద్దగా మెప్పించలేకపోయింది. చాలామంది దీన్ని జిమ్మిక్కుగా, ఒక డిస్టబెన్స్‌గా, అన్‌రిలయబుల్‌గా భావించారు. చాలా మంది వ్యక్తులు ఫిజికల్ ఫంక్షన్ కీస్‌ను ఇష్టపడ్డారు కానీ వాటిని టచ్ బార్ రీప్లేస్ చేసింది. కొందరు టచ్ బార్‌తో వచ్చిన ఫాల్టీ మ్యాజిక్ కీబోర్డ్ గురించి కూడా ఫిర్యాదు చేశారు. టచ్ బార్ అనేది కీబోర్డ్ పైన ఉన్న టచ్-సెన్సిటివ్ కీస్‌ స్ట్రిప్.అందువల్ల, టాపిల్ టచ్ బార్ మోడల్‌ను దశలవారీగా తొలగించి, కొత్త M3 మాక్‌బుక్ ప్రో 14-అంగుళాల మోడల్‌తో భర్తీ చేయాలని నిర్ణయించింది.  మెరుగైన పర్ఫామెన్స్, బ్యాటరీ లైఫ్ ఆఫర్ చేస్తుంది. కొత్త మోడల్‌లో పెద్ద స్క్రీన్, రీడిజైన్డ్‌ కీబోర్డ్, వెబ్‌క్యామ్ కోసం నాచ్ కూడా ఉన్నాయి. టచ్ బార్ మోడల్ ఇకపై యాపిల్ వెబ్‌సైట్ లేదా స్టోర్‌లలో అందుబాటులో ఉండదు. భవిష్యత్తులో యాపిల్ నుంచి అఫీషియల్ సపోర్ట్ లేదా అప్‌డేట్‌లను పొందే అవకాశం లేదు. యాపిల్ ప్రమాణాలు లేదా అంచనాలను అందుకోలేని ప్రొడక్టులను వెంటనే డిస్‌కంటిన్యూ చేస్తుంది. కొన్నిసార్లు వాటిని కంపెనీ హిస్టరీ నుంచి చెరిపివేస్తుంది. టచ్ బార్ మోడల్ అనేది కస్టమర్లను లేదా రివ్యూవర్స్‌ను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయిన ప్రొడక్ట్. యాపిల్ దాని నుంచి ముందుకు సాగడానికి ప్రయత్నిస్తోంది. ఇది టచ్ బార్‌తో కూడిన మ్యాక్‌బుక్ ప్రోకి వీడ్కోలు పలుకుతుంది. 

Post a Comment

0 Comments

Close Menu